GNTR: ఆర్టీసీ బస్టాండు పార్సిల్ కార్యాలయంలోని పార్సిళ్లకు ఈ నెల 30న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరావత్తులు చెల్లించి, ఎవరైనా పాల్గొనవచ్చని పిలుపునిచ్చారు. పూర్తి సమాచారం కోసం నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
GNTR: పోలీసునని నటిస్తూ విద్యార్థినిని బెదిరించి అత్యాచారం చేసిన వ్యక్తిపై జిల్లా కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. గోపి అనే వ్యక్యికి 10 ఏళ్ల కారాగార శిక్షతో పాటు రూ.23 వేల జరిమానా విధించింది. ఇప్పటికే 29 కేసులు ఉన్న నిందితుడిపై కోర్టు తీవ్రంగా స్పందించింది. బాధితురాలికి రూ.1లక్ష పరిహారం అందజేయాలని ఆదేశించింది.
తూ.గో: రాజానగరంలోని ఐవోసీఎల్ పెట్రోల్ బంక్‌ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సరఫరాలో అక్రమాలు జరిగితే 8074661259 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ధరలు, కొలతలను పరిశీలించి, నిరంతర సరఫరాకు అధికారులను ఆదేశించారు.
తూ.గో: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ డి.నరసింహ కిషోర్ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. వాళ్లతో మాట్లాడి వారి సమస్యలను ఆలకించారు. సమస్య ఉన్నచోట్ల సంబంధిత పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలన్నారు.
ATP: హనీ ట్రాప్ కేసులో కీలక సూత్రధారి, రుద్రంపేట మాజీ వైస్ సర్పంచ్ నరేంద్రరెడ్డి, ఓం ప్రకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. రంగమ్మ, ఉమాదేవి గ్యాంగులతో సంబంధాలు నడుపుతూ బాధితులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో నరేంద్రరెడ్డిది కీలక పాత్ర అని పోలీసులు తెలిపారు.
NLR: వింజమూరు మండలంలోని నల్లగొండ్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సంబంధించి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ లెక్కల కాంతారెడ్డి, కార్యనిర్వహణాధికారి బి.శాంతయ్య తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
కోనసీమ: పార్లమెంట్లో ఇటీవల ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు విషయంలో ప్రతిపక్షాలు చేసిన కుట్రను నిరసిస్తూ అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో కూటమి ఎమ్మెల్యేలు పాల్గొని ఇండి కూటమి వైఖరిని తప్పు పట్టారు. బిల్లుకు అడ్డుపడే వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
KRNL: 104 సేవల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు భద్రత కల్పించాలని ఉద్యోగుల సంఘం నాయకులు మంత్రాలయం TDP ఇంఛార్జి రాఘవేంద్ర రెడ్డికి ఇవాళ వినతిపత్రం అందజేశారు. తక్కువ వేతనాలు, బకాయిల చెల్లింపుల్లో ఆలస్యం, గ్రాట్యుటీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. అలాగే డ్రైవర్లకు స్లాబ్ అమలు, కనీస వేతనం పెంపు వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
BPT: పంగులూరు మండలంలోని రేణింగవరం గ్రామంలో ఉన్న పెట్రోల్ బంకును సోమవారం మండల తహసీల్దార్, ఎస్సై వినోద్ బాబు సంయుక్తంగా తనిఖీ చేశారు. బంకులో ఉన్న స్టాక్ రిజిస్టర్లను, నిల్వలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సదరు బంకులో ప్రస్తుతం 12,000 లీటర్ల పెట్రోల్ నిల్వ ఉందని గుర్తించినట్లు తెలిపారు.
NDL: మిడుతూరు (మం) రోళ్ళపాడు గ్రామానికి చెందిన శివుడిని విద్యుత్ శాఖలో వాచ్‌మన్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి కోడుమూరుకు చెందిన వీరేష్ రూ.1.50లక్షలు తీసుకున్నాడని ఆరోపించారు. ఉద్యోగం ఇవ్వకపోగా డబ్బులు తిరిగి ఇవ్వలేదని బాధితుడు సోమవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. బంగారం తాకట్టు పెట్టి అప్పు తీసుకుని డబ్బులు ఇచ్చినట్లు బాధితుడు తెలిపాడు.
సత్యసాయి: జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులను నివారించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇంధన కొరత లేదా ధరల వ్యత్యాసంపై ప్రజలు 08555 288566 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. వినియోగదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అధికారుల బృందం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సమీక్షించారు. మే నెలలో జరుగనున్న ఈ గంగమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ సిబ్బందిలకు అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కోనసీమ: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ప్రజల వినతులు, సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత అధికారులకు పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రతి సమస్యను ప్రాధాన్యతగా తీసుకుంటామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు.
కడప జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయాల నేపథ్యంలో తాత్కాలిక రేషనలైజేషన్ విధానం అమలు చేస్తున్నట్లు కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కార్లు, చిన్న సరకు వాహనాలకు 30 లీటర్లు, లారీలు, ప్రైవేట్ బస్సులకు 100 లీటర్లు, వరికోత యంత్రాలకు 80 లీటర్ల వరకు మాత్రమే డీజిల్ ఇవ్వనున్నారు. అంబులెన్స్‌లు, ప్రజా రవాణా వాహనాలకు ఇంధన సరఫరా కొనసాగుతుందన్నారు.
విశాఖ పెట్టుబడుల ప్రధాన కేంద్రంగా మారుతోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆనందపురం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి దేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడుల్లో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. చంద్రబాబు విజన్‌తో విశాఖ ఐటీ హబ్‌గా మారనుందన్నారు.