ప్రకాశం: గిద్దలూరు 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో సాంకేతిక మరమ్మతుల కారణంగా, గిద్దలూరు మండలంలోని అన్ని విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని డీఈఈ శేషగిరిరావు తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ ఉండదన్నారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.
ASR: వివిధ వ్యాధులను నయంచేసే హోమియోపతి వైద్యంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని జీకేవీధి మండలం సీలేరు హోమియోపతి వైద్యాధికారి డా.సృజనారాయ్ సూచించారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా ఇవాళ డా.శామ్యూల్ హానిమన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాధారణ జలుబు, జ్వరం వంటి చిన్న సమస్యల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు హోమియోపతి నయం చేస్తుందన్నారు.
కడప: జిల్లా రాజుపాలెం మండలం పర్లపాడులో శుక్రవారం బండి మహేశ్ బాబు (25) దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన మహేశ్, చరణ్ గొడవపడ్డారు. ఈ గొడవలో మహేశ్ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజుపాలెం SI ప్రణయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.
W.G: నరసాపురం మున్సిపల్ పన్ను చెల్లింపుదారులకు కమిషనర్ వెంకట రామిరెడ్డి తీపి కబురు అందించారు. 2026-27 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నును ఏప్రిల్ 30లోపు ఒకేసారి చెల్లిస్తే 5% రిబేట్ లభిస్తుంది. అలాగే, గత ఏడాది బకాయిలపై 50% వడ్డీ మాఫీతో చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ వెసులు బాటును వినియోగించుకొని ప్రజలు గడువులోగా పన్నులు చెల్లించాలని కోరారు.
అన్నమయ్య: జిల్లాలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమాలను ఈ నెల 23 వరకు విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ నిశాంత్ అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ స్థాయిలో పౌష్టికాహారం ప్రాధాన్యంపై అవగాహన పెంచాలని సూచించారు. జంక్ ఫుడ్, అధిక ఉప్పు-నూనె వాడకం ప్రమాదకరమని హెచ్చరించారు. చిన్నపిల్లల్లో స్క్రీన్ టైమ్ తగ్గించి ఆరోగ్యకర జీవనశైలిని అలవాటు చేయాలని పేర్కొన్నారు.
CTR: చిత్తూరు నూతన డీఎస్పీగా వెంకటనారాయణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్థుతం చిత్తూరు డీఎస్పీగా పనిచేస్తున్న డీఎస్పీ టీ సాయినాధ్ బదిలీ అయ్యారు. బదిలీ అయిన సాయినాధ్ తన పదవీకాలంలో చిత్తూరులో పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు తెలిపారు.
SS: బస్సులో పోగొట్టుకున్న బంగారు నెక్లెస్, నగదు ఉన్న పర్సును తిరిగి అప్పగించి పెనుకొండకు చెందిన నూర్ మహ్మద్ నిజాయితీ చాటుకున్నారు. సోమందేపల్లికి చెందిన కృష్ణబాయి బస్సులో ప్రయాణిస్తూ రూ.1.90 లక్షల విలువైన నగలున్న పర్సు పోగొట్టుకోగా, దానిని గుర్తించిన మహ్మద్ పోలీసులకు సమాచారం అందించారు. సోమందేపల్లి SI సుధాకర్ యాదవ్ ఆ వస్తువులను బాధితురాలికి అందజేశారు.
E.G: కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సేవ కోసం, వారికి అవసరమైన అన్ని వ్యవసాయ సదుపాయాలు, సహాయం ఒకే చోట అందేలా ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కేంద్రం ద్వారా రైతులకు మరింత సౌలభ్యం కలుగుతుందన్నారు.
AKP: మాడుగులలో ఇవాళ భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో బీసీ ధర్మదీక్ష కరపత్రాలు పంపిణీ చేశారు. బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ నెల 11 నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహారదీక్ష చేపడతారని కన్వీనర్ కోన నాగేశ్వరరావు తెలిపారు. రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూమి, కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణన కోరారు.
SS: జిల్లాలోని 395 అంగన్‌వాడీ కేంద్రాలకు రూ. 20 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ఆట వస్తువుల కిట్లను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పంపిణీ చేశారు. 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంకా దినకర్, ఎమ్మెల్యే పల్లె సింధుర రెడ్డితో కలిసి కలెక్టరేట్‌లో వీటిని ప్రారంభించారు. పిల్లల మేధో వికాసానికి, శారీరక ఎదుగుదలకు ఈ కిట్లు దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు.
కోనసీమ: పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP -SAMPARK కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది తమ వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలపై ఫోన్ ద్వారా ఎస్పీకి వివరించారు. పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు.
AKP: మునగపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం.హైమావతి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ప్రతి ఒక్కరికీ ఆభా ఐడీలు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయాలని సూచించారు. వడదెబ్బపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
NTR: తిరువూరు మండలం చిట్టెల ప్రిన్సెస్ అఫ్ పీస్ చర్చిలో హోప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 20 మందికి కుట్టు మిషన్లు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హోప్ మినిస్ట్రీస్ సేవకులు పాస్టర్ డేవిడ్ రాజ్. పాస్టర్, ఎం. నెహెమ్య స్థానిక సంఘ కాపరి ఎం.పరిశుద్ధ రాజ్ పాల్గొని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని వారు చెప్పుకొచ్చారు.
ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో వెల్లమిల్లి గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహ ఆవిష్కరణ శుక్రవారం రాత్రి జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వంగవీటి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.
కడప: ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు 2026-27 విద్యా సంవత్సరానికి ముందస్తు అడ్మిషన్లు చేపట్టి ఫీజుల దోపిడికి పాల్పడుతున్నాయని AISF, AIYF జిల్లా నాయకులు ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి అక్రమ అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.