SS: బస్సులో పోగొట్టుకున్న బంగారు నెక్లెస్, నగదు ఉన్న పర్సును తిరిగి అప్పగించి పెనుకొండకు చెందిన నూర్ మహ్మద్ నిజాయితీ చాటుకున్నారు. సోమందేపల్లికి చెందిన కృష్ణబాయి బస్సులో ప్రయాణిస్తూ రూ.1.90 లక్షల విలువైన నగలున్న పర్సు పోగొట్టుకోగా, దానిని గుర్తించిన మహ్మద్ పోలీసులకు సమాచారం అందించారు. సోమందేపల్లి SI సుధాకర్ యాదవ్ ఆ వస్తువులను బాధితురాలికి అందజేశారు.
E.G: కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సేవ కోసం, వారికి అవసరమైన అన్ని వ్యవసాయ సదుపాయాలు, సహాయం ఒకే చోట అందేలా ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కేంద్రం ద్వారా రైతులకు మరింత సౌలభ్యం కలుగుతుందన్నారు.
AKP: మాడుగులలో ఇవాళ భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో బీసీ ధర్మదీక్ష కరపత్రాలు పంపిణీ చేశారు. బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ నెల 11 నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహారదీక్ష చేపడతారని కన్వీనర్ కోన నాగేశ్వరరావు తెలిపారు. రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూమి, కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణన కోరారు.
SS: జిల్లాలోని 395 అంగన్‌వాడీ కేంద్రాలకు రూ. 20 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ఆట వస్తువుల కిట్లను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పంపిణీ చేశారు. 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంకా దినకర్, ఎమ్మెల్యే పల్లె సింధుర రెడ్డితో కలిసి కలెక్టరేట్‌లో వీటిని ప్రారంభించారు. పిల్లల మేధో వికాసానికి, శారీరక ఎదుగుదలకు ఈ కిట్లు దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు.
NTR: తిరువూరు మండలం చిట్టెల ప్రిన్సెస్ అఫ్ పీస్ చర్చిలో హోప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 20 మందికి కుట్టు మిషన్లు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హోప్ మినిస్ట్రీస్ సేవకులు పాస్టర్ డేవిడ్ రాజ్. పాస్టర్, ఎం. నెహెమ్య స్థానిక సంఘ కాపరి ఎం.పరిశుద్ధ రాజ్ పాల్గొని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని వారు చెప్పుకొచ్చారు.
ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో వెల్లమిల్లి గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహ ఆవిష్కరణ శుక్రవారం రాత్రి జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వంగవీటి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.
కడప: ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు 2026-27 విద్యా సంవత్సరానికి ముందస్తు అడ్మిషన్లు చేపట్టి ఫీజుల దోపిడికి పాల్పడుతున్నాయని AISF, AIYF జిల్లా నాయకులు ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి అక్రమ అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ ఆధ్వర్యంలో “ఎస్పీ–సంపర్క్” కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి శుక్రవారం 3 నుంచి 5 గంటల వరకు పోలీస్ సిబ్బంది 8688831470 నంబర్‌కు కాల్ చేసి సమస్యలు నేరుగా తెలియజేయవచ్చిని తెలిపారు. పోస్టింగులు, లీవులు, వెల్ఫేర్ వంటి అంశాలపై తక్షణ స్పందన కల్పిస్తామని ఎస్పీ అన్నారు.
ATP: ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ నలుగురు దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేశారు. ఎంపీ నిధుల నుంచి మంజూరైన ఈ వాహనాల తాళాలను లబ్ధిదారులు షేక్ నబీ సాబ్, హరినాథ్ రెడ్డి, శ్రీకాంత్, శ్రీనాథ్ రెడ్డికి శుక్రవారం అందజేశారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే స్పందించి వాహనాలు అందించినందుకు లబ్ధిదారులు ఎంపీకి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
VZM: కొత్తవలస విజయనగరం ప్రధాన రహదారి బెల్లాల డాక్టర్ హాస్పిటల్ నుంచి అన్న క్యాంటీన్ వచ్చే మురుగుకాలువ ఇవాళ కురిసిన వర్షానికి కాలువలో పేరుకుపోయిన చెత్త రోడ్డు మీదకు కొట్టుకువచ్చింది. కొద్దిపాటి వర్షానికే మురుగునీరు రోడ్డుమీద ప్రవహించడంతో దుకాణంలో ఉన్న సరుకులు జలపాతం అవుతున్నాయని దుకాణదారులు వాపోతున్నారు. పంచాయతీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
అన్నమయ్య: రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే రౌడీ షీటర్లకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. మన్నూరు పోలీస్ పరిధిలో శుక్రవారం నిర్వహించిన కౌన్సిలింగ్‌లో నేరప్రవృత్తిని విడిచి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు.
W.G: MLA ఆరిమిల్లి రాధాకృష్ణ శనివారం అమరావతిలోని సచివాలయంలో CM చంద్రబాబుని కలిశారు. తణుకు నియోజకవర్గంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సీఎంకు వివరించారు. నియోజకవర్గంలోని మున్సిపల్ రహదారులు, భవనాల నిర్మాణం, పెండింగ్లో ఉన్న ఇతర పనులకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
అన్నమయ్య: వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం పొడిగిస్తూ జీవోఎంఎస్ 43 జారీ చేసింది. ఈ పథకం ద్వారా అక్రిడిటెడ్, ఫ్రీలాన్స్, వేటరన్ జర్నలిస్టులు మరియు వారి కుటుంబాలకు క్యాష్‌లెస్ వైద్యం కొనసాగుతుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సమాచార అధికారి తెలిపారు.
ప్రకాశం: దర్శి మండలం పోతవరం గ్రామంలో శుక్రవారం పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాజాబాబు పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
KRNL: ప్రముఖ టీవీ యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలను ఆ పార్టీ తుగ్గలి మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చెక్క శీను శుక్రవారం హైదరాబాదులో కలిశారు. ఆమెకు పూల మొక్కను అందజేశారు. మండలంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై శ్యామల ఆరా తీశారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించినట్లు శీను తెలిపారు.