VSP: మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్కు అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. 2016 ఏప్రిల్ 17న ప్రత్యేక రైల్వే జోన్ కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమరణ దీక్ష చేయడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఇది ఆత్మహత్యాయత్నమని అప్పటి పోలీసులు కేసు నమోదు చేయగా, దీనిపై ఇవాళ తీర్పు వెలువడింది.
పార్వతీపురం మండలంలో గల పనసభద్ర, తొక్కుడు వలస, కోరి గంగాపురం పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరిజన గ్రామాలను సందర్శించారు. గ్రామంలో ఉన్న గిరిజనులతో గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు త్రాగునీరు లేక ఎన్నో అవస్థలు పడుతున్నట్లు మహిళలు తెలిపారు. విద్యుత్ సౌకర్యం లేక, సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు లేక రోగాలు బారిన పడుతున్నట్లు తెలిపారు.
NTR: అమరావతి సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్‌ను ఎమ్మెల్యే శ్రీనివాసరావు శుక్రవారం కలిశారు. తిరువూరులో బీసీ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని, నియోజకవర్గ పరిధిలో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్‌లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ప్రకాశం: గిద్దలూరు 132/33 కేవీ సబ్ స్టేషన్లో సాంకేతిక మరమ్మతుల కారణంగా, గిద్దలూరు మండలంలోని అన్ని విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని డీఈఈ శేషగిరిరావు తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ ఉండదన్నారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.
ASR: వివిధ వ్యాధులను నయంచేసే హోమియోపతి వైద్యంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని జీకేవీధి మండలం సీలేరు హోమియోపతి వైద్యాధికారి డా.సృజనారాయ్ సూచించారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా ఇవాళ డా.శామ్యూల్ హానిమన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాధారణ జలుబు, జ్వరం వంటి చిన్న సమస్యల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు హోమియోపతి నయం చేస్తుందన్నారు.
కడప: జిల్లా రాజుపాలెం మండలం పర్లపాడులో శుక్రవారం బండి మహేశ్ బాబు (25) దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన మహేశ్, చరణ్ గొడవపడ్డారు. ఈ గొడవలో మహేశ్ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజుపాలెం SI ప్రణయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.
W.G: నరసాపురం మున్సిపల్ పన్ను చెల్లింపుదారులకు కమిషనర్ వెంకట రామిరెడ్డి తీపి కబురు అందించారు. 2026-27 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నును ఏప్రిల్ 30లోపు ఒకేసారి చెల్లిస్తే 5% రిబేట్ లభిస్తుంది. అలాగే, గత ఏడాది బకాయిలపై 50% వడ్డీ మాఫీతో చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ వెసులు బాటును వినియోగించుకొని ప్రజలు గడువులోగా పన్నులు చెల్లించాలని కోరారు.
అన్నమయ్య: జిల్లాలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమాలను ఈ నెల 23 వరకు విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ నిశాంత్ అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ స్థాయిలో పౌష్టికాహారం ప్రాధాన్యంపై అవగాహన పెంచాలని సూచించారు. జంక్ ఫుడ్, అధిక ఉప్పు-నూనె వాడకం ప్రమాదకరమని హెచ్చరించారు. చిన్నపిల్లల్లో స్క్రీన్ టైమ్ తగ్గించి ఆరోగ్యకర జీవనశైలిని అలవాటు చేయాలని పేర్కొన్నారు.
CTR: చిత్తూరు నూతన డీఎస్పీగా వెంకటనారాయణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్థుతం చిత్తూరు డీఎస్పీగా పనిచేస్తున్న డీఎస్పీ టీ సాయినాధ్ బదిలీ అయ్యారు. బదిలీ అయిన సాయినాధ్ తన పదవీకాలంలో చిత్తూరులో పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు తెలిపారు.
KKD: కోటనందూరు మండలంలో టీడీపీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మండల అధ్యక్షుడు పోతల సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. హైస్కూల్ ప్రాంగణంలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన కస్తూర్బా హాస్టల్ భవనాన్ని, కేఈ చిన్నయ్య పాలెంలో కొత్త సిమెంట్ రోడ్లను ప్రారంభించారు
KKD: కోటనందూరు మండలంలో టీడీపీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మండల అధ్యక్షుడు పోతల సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. హైస్కూల్ ప్రాంగణంలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన కస్తూర్బా హాస్టల్ భవనాన్ని, కేఈ చిన్నయ్య పాలెంలో కొత్త సిమెంట్ రోడ్లను ప్రారంభించారు
KKD: కోటనందూరు మండలంలో టీడీపీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మండల అధ్యక్షుడు పోతల సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. హైస్కూల్ ప్రాంగణంలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన కస్తూర్బా హాస్టల్ భవనాన్ని, కేఈ చిన్నయ్య పాలెంలో కొత్త సిమెంట్ రోడ్లను ప్రారంభించారు
SS: బస్సులో పోగొట్టుకున్న బంగారు నెక్లెస్, నగదు ఉన్న పర్సును తిరిగి అప్పగించి పెనుకొండకు చెందిన నూర్ మహ్మద్ నిజాయితీ చాటుకున్నారు. సోమందేపల్లికి చెందిన కృష్ణబాయి బస్సులో ప్రయాణిస్తూ రూ.1.90 లక్షల విలువైన నగలున్న పర్సు పోగొట్టుకోగా, దానిని గుర్తించిన మహ్మద్ పోలీసులకు సమాచారం అందించారు. సోమందేపల్లి SI సుధాకర్ యాదవ్ ఆ వస్తువులను బాధితురాలికి అందజేశారు.
E.G: కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సేవ కోసం, వారికి అవసరమైన అన్ని వ్యవసాయ సదుపాయాలు, సహాయం ఒకే చోట అందేలా ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కేంద్రం ద్వారా రైతులకు మరింత సౌలభ్యం కలుగుతుందన్నారు.
AKP: మాడుగులలో ఇవాళ భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో బీసీ ధర్మదీక్ష కరపత్రాలు పంపిణీ చేశారు. బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ నెల 11 నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహారదీక్ష చేపడతారని కన్వీనర్ కోన నాగేశ్వరరావు తెలిపారు. రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూమి, కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణన కోరారు.