BPT: అద్దంకిలో బెదిరించి నగదు, బంగారం, మొబైల్ అపహరించిన కేసులో ఒంగోలుకు చెందిన సుబ్రహ్మణ్యంను శింగరకొండ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌తో పాటు 14 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఇద్దరు బాలురను జువెనైల్ కోర్డులో హాజరు పరచనున్నారు.
ELR: ఆగిరిపల్లి కొండ కాలనీలో శనివారం ఆపరేషన్ వజ్ర ప్రహర్ పేరిట పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసు సిబ్బంది ఆయా ప్రాంతాలను చుట్టు ముట్టి ప్రతి ఇంటిని, అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 47 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదన్నారు.
ATP: అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ ఛైర్పర్సన్ గిరిజమ్మ, బీసీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, విద్య కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు.
ప్రకాశం: త్రిపురాంతకం మండలం పాత అన్నసముద్రంలో శనివారం క్షుద్ర పూజలు చేస్తున్నారని చిన్నమ్మపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని పూజలు చేస్తున్న వారిని విచారించారు. తన ఇంటిలో మనవడికి ఆరోగ్యం బాగుండడం లేదని అలానే తన మరొక కొడుకుకు వివాహం కావాలని పూజలు చేస్తున్నట్లు పోలీసులకు చిన్నమ్మ తెలిపింది.
AKP: మునగపాక పీ.హెచ్.సీని డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ హైమావతి శుక్రవారం తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఎండలు ఎక్కువగా నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
కృష్ణా: ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద మంచి రూ. 74,530 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
GNTR: గుంటూరు కాకుమాను వారి తోటలోని 6.26 ఎకరాల ‘చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణం’ ఎట్టకేలకు జీఎంసీకి బదిలీ అయింది. ఏళ్ల తరబడి ఉన్న నిరీక్షణకు తెరపడింది. కార్మిక శాఖ ఈ స్థలాన్ని జీఎంసీకి అప్పగించింది. ఎంపీ పెమ్మసాని, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మాజీ మేయర్ రవీంద్ర నాని, స్థానికుల కృషితోనే ఇది సాధ్యమైందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ATP: జిల్లా పర్యటనకు విచ్చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డికి నగర కాంగ్రెస్ కమిటీ ఘనంగా స్వాగతం పలికింది. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, కేకేసీ రాష్ట్ర అధికార ప్రతినిధి యం.యం.డీ. ఇమామ్ ఆధ్వర్యంలో నాయకులు ఆమెకు సాదరంగా ఆహ్వానం పలికారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ మేరకు షర్మిల పలు సూచనలు చేశారు.
సత్యసాయి: పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్ బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా తాజాగా జరిగిన డీఎస్పీల బదిలీల్లో భాగంగా ఈయనను శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. విజయకుమార్ పుట్టపర్తి డీఎస్పీగా 18 నెలల నుంచి విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించలేదు.
NDL: మహానంది ఆలయం వెనుక నల్లమల అడవుల్లో మరోసారి అగ్నిమాపక ఘటన చోటుచేసుకుంది. ఇటీవల పలుమార్లు మంటలు వ్యాపించగా అటవీ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. శుక్రవారం రాత్రి మళ్లీ మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. అడవుల్లోకి అక్రమ ప్రవేశాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
PLD: పిడుగురాళ్లలో జరుగుతున్న ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ తరగతులను తహశీల్దార్ జెట్టి మధుబాబు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ CH. శైలజ సందర్శించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వారు రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను తహశీల్దార్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ సారధి, రవి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అన్నమయ్య: జిల్లా పుంగనూరులోని భగత్ సింగ్ కాలనీలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో సుమారు 50 మంది సిబ్బంది ఇంటింటి తనిఖీలు చేపట్టి అనుమానితుల వివరాలు, వాహనాల పత్రాలు పరిశీలించారు. ప్రజలకు భద్రతపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
GNTR: తెనాలిలో శనివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు పర్యటించారు. 14వ వార్డులో పర్యటించిన ఆయన అక్కడ జరుగుతున్న శానిటేషన్ పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో శానిటేషన్ పనులు ఎక్కడ ఇబ్బంది లేకుండా జరగాలని కోరారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
NTR: విజయవాడ దుర్గగుడి పరిధిలోని కనకదుర్గానగర్ మరుగుదొడ్లలో గుర్తించిన మృతదేహం ఘటనపై ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. యాచకుడిగా భావిస్తున్న వ్యక్తి మృతి విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వెలుగుచూసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన EO శీనానాయక్ శానిటరీ ఇన్స్పెక్టర్ రజినీప్రియను తొలగించి, శానిటేషన్ ఏజెన్సీకి షోకాజ్ నోటీసులు జారీ చేసి, నలుగురిని తొలగించారు.
ASR: జిల్లాలో భూగర్భ జలాలను పెంచే దిశగా ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ టీ.నిశాంతి ఆదేశించారు. చెక్ డ్యాంలు, ఫారం పాండ్స్ నిర్మాణాలకు మండలాల వారీగా మ్యాపులను తయారు చేయాలని సూచించారు. శుక్రవారం పాడేరు కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో అధిక వర్షపాతం నమోదవుతుందన్నారు. దానికి అనుగుణంగా భూగర్భ జలాలను పెంచే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు.