• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మాతృ, శిశు మరణాల నివారణకు కృషి: కలెక్టర్

WG: జిల్లాలో మాతృ, శిశు మరణాలను పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది గర్భిణులు, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా ఉంచి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.

May 31, 2026 / 07:14 AM IST

క్రికెట్ బుకీలు అరెస్ట్: ASP

KDP: ప్రొద్దుటూరులో శనివారం 13 మంది క్రికెట్ బుకీలను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.11.34 లక్షల నగదు, 27 సెల్ ఫోన్లు, 1 ట్యాబ్ స్వాధీనం చేసుకున్నట్లు ASP విభుకృష్ణ తెలిపారు. ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్పై నిఘా పెట్టామన్నారు. ఈ క్రమంలో క్రికెట్ నెట్ ప్రాక్టీస్ అకాడమీ పేరుతో బెట్టింగ్ చేస్తున్న షేక్ జావీద్ మరో 12 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

May 31, 2026 / 07:03 AM IST

గడువులోగాఈ-కేవైసీ పూర్తి చేయండి: జేసీ

E.G: జిల్లాలో ఈ-కేవైసీ ప్రక్రియను పెండింగ్లో ఉన్న వారందరూ వెంటనే పూర్తి చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన వీడియో సందేశం ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఇప్పటికే 98.71 శాతం ఈ-కేవైసీ పూర్తయిందని, ఇంకా సుమారు 23,000 మంది చేయించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ గడువులోగా పూర్తి చేయాలన్నారు.

May 31, 2026 / 07:00 AM IST

కదిరి ఆర్డీవోగా కళావతి బాధ్యతలు

సత్యసాయి: కదిరి రెవెన్యూ డివిజనల్ అధికారిగా (ఆర్డీవో) కళావతి బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఆమెకు రెవెన్యూ సిబ్బంది, డివిజన్ పరిధిలోని మండలాల తహసీల్దార్లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. నూతన ఆర్డీవోకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

May 31, 2026 / 07:00 AM IST

గిద్దలూరులో 12 అక్రమ లే అవుట్ల తొలగింపు

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో పట్టణ ప్రణాళికా విభాగం టీపీబీవో రాజారెడ్డి ఆధ్వర్యంలో అక్రమ లేఅవుట్లపై చర్యలు చేపట్టారు. రాచర్ల, కృష్ణంశెట్టిపల్లె, కొమరోలు రహదారుల్లోని 12 అక్రమ లే అవుట్లను గుర్తించి, వాటి హద్దురాళ్లు, రహదారులను యంత్రాలతో తొలగించారు. అక్రమ లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని, వాటికి భవన నిర్మాణ అనుమతులు లభించవని అధికారులు హెచ్చరించారు.

May 31, 2026 / 06:47 AM IST

అక్రమంగా నిల్వ ఉంచిన పెట్రోలు సీజ్

KDP: బద్వేలు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆదేశాల మేరకు కలసపాడు టౌన్లో అధికారు శనివారం దాడులు చేశారు. డి.కృష్ణారెడ్డి దుకాణంలో 4 లీటర్లు, దూదేకుల దస్తగిరిమ్మ దుకాణంలో 7 లీటర్లు, జక్క సుధాకర్ దుకాణంలో 5 లీటర్లు కలిపి మొత్తం 16 లీటర్ల పెట్రోలు సీజ్ చేశారు. అక్రమంగా పెట్రోల్ నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

May 31, 2026 / 06:40 AM IST

బద్వేలు బైపాసులో ఘోర రోడ్డు ప్రమాదం

KDP: బద్వేల్ నేషనల్ హైవే-67 బైపాస్ రోడ్డులో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం రోడ్డుపై ఉన్న పశువులను ఢీకొనడంతో 4 పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. అనంతరం రోడ్డుపై ఉన్న పశువులను గమనించలేక బైకుపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. బద్వేల్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

May 31, 2026 / 06:37 AM IST

మంచి నీటి ట్యాంక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

ELR: బుట్టాయిగూడెం(m)వీరన్నపాలెం గ్రామంలో 15 ఏళ్ల మంచినీటి సమస్యను పరిష్కరిస్తూ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నూతన ట్యాంకులను ప్రారంభించారు. ప్రజల విన్నపంపై స్పందించి కేవలం వారం రోజుల్లోనే తాగునీటి సౌకర్యం కల్పించామని ఎమ్మెల్యే అన్నారు. గ్రామీణాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని నియోజకవర్గంలోని ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.

May 31, 2026 / 06:32 AM IST

ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి: కలెక్టర్

GNTR: ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో రహదారి భద్రత, మత్తు మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశాలు జరిగాయి. జిల్లాను ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలన్నారు. సీఆర్‌డీఏ పరిధిలో సీడ్ యాక్సెస్ రోడ్డుపై ప్రమాదాల నియంత్రణకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు.

May 31, 2026 / 06:32 AM IST

‘తల్లికి వందనం’ లబ్ధికి బ్యాంక్ ఖాతా తప్పనిసరి’

W.G: 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తిచేసి ఇంటర్లో చేరుతున్న ఎస్సీ విద్యార్థులకు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి అరుణకుమారి కీలక సూచన చేశారు. తల్లికి వందనం పథకం లబ్ధి పొందాలంటే పోస్టల్, ఎస్బీఐ లేదా యూనియన్ బ్యాంకుల్లో విద్యార్థుల పేరిట తప్పనిసరిగా కొత్త ఖాతా తెరవాలని ఆమె స్పష్టం చేశారు.

May 31, 2026 / 06:31 AM IST

అగ్నివీర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి: ఇంఛార్జ్ కలెక్టర్

ATP: అగ్నివీర్, ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. జూన్ 1 నుంచి 12 వరకు ప్రసన్నాయపల్లిలోని ఎన్‌సీసీఎస్‌ఏ కేంద్రంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రం వద్ద భద్రత కల్పించాలని, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

May 31, 2026 / 06:30 AM IST

‘కాలుష్య నియంత్రణ కి కృషి చేయాలి’

W.G: భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పర్యావరణ పరిరక్షణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్వా వ్యర్థ జలాలను నిబంధనలకు విరుద్ధంగా కాలువల్లో వదిలే యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలుష్య ప్రభావంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

May 31, 2026 / 06:27 AM IST

24 మంది ఎస్సైలకు సీఐలుగా ప్రమోషన్

GNTR: దక్షిణ కోస్తా జోన్ పరిధిలోని 24 మంది ఎస్సైలకు సీఐలుగా ప్రమోషన్ కల్పిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి శనివారం ఆదేశాలు ఇచ్చారు. 2025-26 ప్యానెల్‌లో ఎంపికైన వీరిలో జిల్లాకు చెందిన వారు 10 మంది ఉన్నారు. ఖాళీల ఆధారంగా ఈ ప్రమోషన్లు ఇచ్చామని, కొత్త బాధ్యతల్లో అధికారులు సమర్థంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఐజీ సూచించారు.

May 31, 2026 / 06:27 AM IST

పెన్నానదిలో జేసీబీలతో అక్రమ ఇసుక త్రవ్వకాలు

KDP: సిద్ధవటం(M)మాచుపల్లి పెన్నానదిలో JCB యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపడంపై స్థానిక రైతులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలాల్లోకి తోలుకోవాలని రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి పొంది,ఆ ఇసుకను కడపకు తరలించి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి,బోర్లలో నీరు తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.

May 31, 2026 / 06:24 AM IST

అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్యాయత్నం

అన్నమయ్య: మదనపల్లె మండలం ఆవలపల్లిలో శనివారం సాయంత్రం వ్యవసాయ అప్పులు తీరక మనస్తాపానికి గురైన వెంకటేష్ అనే యువ రైతు తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

May 31, 2026 / 06:23 AM IST