• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఉజ్జంగి–సిరసాగూడ రోడ్డులో ప్రమాదకర మలుపు

ASR: డుంబ్రిగూడ మండలం ఉజ్జంగి–సిరసాగూడ మధ్య నిర్మాణంలో ఉన్న బీటీ రోడ్డులో మలుపు ప్రమాదకరంగా ఉందని సర్పంచ్ కిముడు హరి తెలిపారు. ఇటీవల ఒక వాహనం మలుపు వద్ద లోయలో పడిన ఘటన జరిగినట్లు చెప్పారు. రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రమాదాలు నివారించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పనులు పూర్తికాకముందే మలుపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.

April 7, 2026 / 11:34 AM IST

ఆటో కాలువలో పడి పలువురికి గాయాలు

నంద్యాల పట్టణంలోని నూనెపల్లె గెలివి వే బ్రిడ్జి వద్ద ఇవాళ ఆటో ప్రమాదవశాత్తు కాలువలో పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న పలువురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

April 7, 2026 / 11:33 AM IST

జిన్నాంలో పాలధార చెరువు పనులను పరిశీలించిన పీడీ

VZM: గజపతినగరం మండలంలోని జిన్నాం గ్రామంలో పాలధార చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను జిల్లా జలయాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ శారదాదేవి ఇవాళ పరిశీలించారు. పని ప్రదేశంలో శ్రామికులందరికీ ముఖ ఆధారిత హాజరు వెళ్లిందా లేదా, పని ప్రదేశంలో సదుపాయాలు, నాణ్యత ప్రమాణాలతో పనిచేయిస్తున్నారా లేదా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.

April 7, 2026 / 11:30 AM IST

కళాశాల కెమిస్ట్రీ లెక్చరర్‌కు లెఫ్టినెంట్ హోదా

VSP: కృష్ణ కళాశాల కెమిస్ట్రీ లెక్చరర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తూ అదనంగా NCC బాధ్యతలు నిర్వహిస్తున్న బాలకృష్ణకు 3 నెలల పాటు మహారాష్ట్రలో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఓటీఏ ట్రైనింగ్ నిర్వహించగా 570 మంది దేశవ్యాప్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కళాశాల ప్రిన్సిపల్ విజయ్ బాబు ఇవాళ సత్కరించారు.

April 7, 2026 / 11:30 AM IST

తాగునీటి కోసం ముందస్తు చర్యలు

KRNL: తుంగభద్ర డ్యామ్ నుంచి ఎల్లెల్సీకు నీటి విడుదల నేపథ్యంలో ఆదోని మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహ్మద్ బసాపురం కాలువను ఇవాళ పరిశీలించారు. వేసవిలో తాగునీటి కొరత లేకుండా ఎస్ఎస్ ట్యాంకుల్లో నీటిని నిల్వ చేసి ప్రజలకు సరఫరా చేస్తామని తెలిపారు. నీటి నిల్వపై ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈ, డీఈలు పాల్గొన్నారు.

April 7, 2026 / 11:18 AM IST

ప్రొద్దుటూరుకు 2 కోర్టులు మంజూరు..!

KDP: రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటి నిర్వహణకు 2730 పోస్టులను మంజూరు చేశారు. ప్రొద్దుటూరుకు అదనంగా మరో 2 కోర్టులు మంజూరయ్యాయి. VIIIవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు, 1వ అదనపు సివిల్ జడ్జి కోర్టు మంజూరు చేశారు. కొత్తగా ఏర్పాటయ్యే కోర్టులకు సిబ్బందిని, ఫర్నిచరు, లైబ్రరీని మంజూరు చేశారు.

April 7, 2026 / 11:15 AM IST

ప్రత్యేక అలంకరణలో బోయకొండ గంగమ్మ

TPT: ప్రముఖ పుణ్య క్షేత్రమైన బోయకొండలో గంగమ్మను మంగళవారం అత్యంత సుందరంగా అలంకరించారు. ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కట్టారు. కోర్కెలు ఫలించిన భక్తులు అమ్మవారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించారు.

April 7, 2026 / 11:14 AM IST

అకాల వర్షం.. నీట మునిగిన వరి పంట

TPT: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా వరి పంట నీట మునిగింది. దీంతో రైతులు నష్టపోయారని సీపీఐ నాయకుడు జనమాల గురవయ్య తెలిపారు. ప్రభుత్వం వెంటనే నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందించాలని ఇవాళ ఆయన డిమాండ్ చేశారు. ఏర్పేడు మండలం కోబాక గ్రామంలో పంటలను పరిశీలించి అధికారులను చర్యలు తీసుకోవాలని కోరారు.

April 7, 2026 / 11:14 AM IST

ప్రభాకర్ భౌతికకాయానికి కేతిరెడ్డి నివాళి

సత్యసాయి: ముదిగబ్బ మండలం గాండ్లవారి పల్లి గ్రామానికి చెందిన మాజీ స్టోర్ డీలర్ పార్నాపల్లి ప్రభాకర్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మంగళవారం ఆ గ్రామానికి చేరుకున్నారు. ప్రభాకర్ భౌతికకాయానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. ప్రభాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

April 7, 2026 / 11:11 AM IST

మర్రిపాలెం అటవీ రేంజ్ అధికారిగా వెంకటరాజు

ASR: కొయ్యూరు మండలం మర్రిపాలెం అటవీ రేంజ్ అధికారిగా వెంకటరాజు ఇవాళ నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. మర్రిపాకలు రేంజ్ అధికారి సింహాచలం చోడవరం బదిలీ అయ్యారు. ఈమేరకు, చింతపల్లి రేంజ్ పరిధిలో డిప్యూటీ రేంజ్ అధికారిగా పనిచేస్తున్న వెంకటరాజు మర్రిపాకలు ఇన్‌ఛార్జ్ రేంజ్ అధికారిగా నియమితులయ్యారు. ఈ సందర్బంగా ఆయనకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

April 7, 2026 / 11:06 AM IST

రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా బంద్

ATP: గుత్తి పట్టణ శివారులోని సత్యసాయి తాగునీటి పైప్‌ లైన్ లీకేజ్‌కు మున్సిపాలిటీ సిబ్బంది మంగళవారం మరమ్మతు పనులు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మీయ మాట్లాడుతూ.. తాగునీటి పైప్‌ లైన్ లీకేజ్ కారణంగా గుత్తి పట్టణానికి రెండు రోజులపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. మరమ్మతుల అనంతరం తాగునీటి సరఫరా యథావిధిగా జరుగుతుందన్నారు.

April 7, 2026 / 11:04 AM IST

బొబ్బిలి మున్సిపల్ ఆర్‌వో‌గా ఉమామహేశ్వరరావు

VZM: బొబ్బిలి మున్సిపల్ రెవిన్యూ అధికారిగా ఎల్.ఉమామహేశ్వరరావు నియామకమయ్యారు. యలమంచిలి మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఆయనకు ప్రమోషన్ రావడంతో ఆర్‌వో‌గా బాధ్యతలు స్వీకరించారు. పన్నులను సకాలంలో వసూలు చేసి మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

April 7, 2026 / 11:02 AM IST

పిడుగు పడి వ్యక్తి మృతి

SKLM: మెళియాపుట్టి మండలం రట్టిని గ్రామానికి చెందిన వినోద్ (40) మహేంద్రగిరి పర్వతంపై పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. మృతునికి భార్య సంతోషి, ఇద్దరూ పిల్లలు ఉన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

April 7, 2026 / 11:00 AM IST

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

VSP: దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పద్మజ దంపతులు ఇవాళ పోలమాంబ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అంతరాలయంలో చీర, సారె, పసుపు, కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈవో రాజ్ గోపాల్ రెడ్డి ప్రసాదం అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో కోరికలు నెరవేరుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

April 7, 2026 / 11:00 AM IST

క్షుద్ర పూజలపై పోలీసులను ఆశ్రయించిన బాధితులు

KRNL: హొళగుంద మండల కేంద్రంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. సాయిబన్న దర్గా వెనుక భాగంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించి, సుమారు 23 మంది రాజకీయ నాయకులు, విలేకరులు, మహిళల ఫోటోలను భూమిలో పాతిపెట్టినట్లు బాధితులు ఇవాళ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై స్థానిక ఎస్సై దిలీప్ కుమార్ స్పందించి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

April 7, 2026 / 10:49 AM IST