• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మండలంలో పొగాకుపై అవగాహన ర్యాలీ

CTR: పొగాకు వాడకంతో ఆరోగ్యానికి నష్టం చేకూరుతుందని సదుం మండలం చెరుకువారిపల్లి పీహెచ్‌సీ డాక్టర్ హేమంత్ కృష్ణ తెలిపారు. ప్రపంచ పోగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పొగాకు వాడకంతో క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడతాయని వెల్లడించారు. వాటి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

May 31, 2026 / 12:44 PM IST

శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ELR: ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయానికి ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. పలు క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం మజ్జిగను , చిన్నపిల్లల కోసం పాలు దేవస్థానం అధికారులు పంపిణీ చేశారు. ఆదివారం అధిక సంఖ్యలో భక్తుల రావడంతో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

May 31, 2026 / 12:30 PM IST

నరసాపురం కాలువకు నీటి విడుదల..!

WG: నరసాపురం ప్రధాన కాలువలోకి ఆదివారం నీటిపారుదలశాఖ అధికారులు నీరు విడుదల చేశారు. వేసవిలో కాలువ పనుల నిమిత్తం నిలిపివేసిన నీటిని తిరిగి వదలడంతో ఖరీఫ్ సీజన్ పంటలకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని డిఈఈ సిహెచ్. వెంకటనారాయణ తెలిపారు. అలాగే ఈ నీటి విడుదలతో పాలకొల్లులో గత కొన్ని రోజులుగా వేధిస్తున్న తాగునీటి సమస్య కూడా పూర్తిగా తీరుతుందని ఆయన పేర్కొన్నారు.

May 31, 2026 / 12:26 PM IST

SGS కళాశాల అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేటఎస్‌జీఎస్ కళాశాలను ఆదివారం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మున్సిపల్ ఛైర్మన్ రాఘవేంద్ర సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇటీవల ఈదురు గాలులు, వర్షాలతో జరిగిన నష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, పూర్తి అంచనా నివేదికను కలెక్టర్‌కు పంపాలని ఎంఆర్ఓను ఆదేశించారు. ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని కళాశాల యాజమాన్యానికి హామీ ఇచ్చారు.

May 31, 2026 / 12:23 PM IST

నీళ్ల వాసన.. పట్టణ ప్రజలకు ఇబ్బందులు

KDP: నీళ్లు వాసన వస్తున్నాయని పులివెందుల పట్టణంలోని లక్ష్మీ హాల్ ఏరియా సరస్వతీ వీధికి చెందిన ప్రజలు ఆదివారం మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. నీళ్లు కూడా 3 రోజులకు ఒకసారి వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ తెలియజేశారు.మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

May 31, 2026 / 12:22 PM IST

రుచికి మారు పేరు అడవి తేనె

అల్లూరి: ఏజెన్సీ అడవుల్లో లభించే స్వచ్ఛమైన తేనెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కొండలు, లోయలు, అటవీ ప్రాంతాల్లో గిరిజనులు సంప్రదాయ పద్ధతుల్లో తేనెను సేకరిస్తున్నారు. ఔషధ గుణాలు, సహజ రుచితో ఈ తేనె వినియోగదారులను ఆకట్టుకుంటోంది. విక్రయ వేదికలు కల్పిస్తే గిరిజనులకు మరింత ఆదాయం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

May 31, 2026 / 12:21 PM IST

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ లోని 18వ డివిజన్, హరినాధపురంలో ప్రజా బాట కార్యక్రమాన్ని ఆదివారం TDP పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నిర్వహించారు. స్థానిక సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18వ డివిజన్ అభివృద్ధికి 7.50 కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు. ఏ సమస్య ఉన్నా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

May 31, 2026 / 12:20 PM IST

తూర్పు నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై సమీక్ష

GNTR: గుంటూరు నగరంలోని తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్, కోర్ క్లస్టర్ ఇన్‌ఛార్జులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయి కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించారు.

May 31, 2026 / 12:15 PM IST

జిందాల్ ప్లాంట్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఎం

PLD: కొండవీడులోని జిందాల్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం పరిశీలించారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహితంగా మార్చాలన్నారు. కాలుష్య రహిత గోదావరి పుష్కరాల కోసం 268 పంచాయతీల్లో శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో 6 ప్లాంట్లు స్థాపిస్తామని పేర్కొన్నారు.

May 31, 2026 / 12:14 PM IST

నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు: ఎమ్మెల్యే

NTR: రూరల్ మండలం గొల్లపూడిలోని వాటర్ ఫిల్టర్ బెడ్‌ను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదివారం పరిశీలించారు. గొల్లపూడి నుంచి జక్కంపూడి వద్ద నిర్మించిన టిడ్కో గృహాలకు సురక్షిత కృష్ణా జలాలను సరఫరవేసవిలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిల్టర్ బెడ్‌ను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

May 31, 2026 / 12:11 PM IST

అమ్మ వారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

NTR: పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే శ్రీ కనకదుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ దృష్ట్యా రూ. 500 దర్శన టికెట్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసి, బంగారు వాకిలి ద్వారా దర్శనం కల్పిస్తున్నారు. ఘాట్ రోడ్, కనకదుర్గానగర్ వైపు వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

May 31, 2026 / 12:10 PM IST

గణపవరంలో పొగాకు వ్యతిరేక దినోత్సవం..!

ELR: పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన ర్యాలీ గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆదివారం నిర్వహించారు. దూమపానం వద్దు, ఆరోగ్యమే ముద్దు అంటూ నినాదాలు చేశారు. గ్రామాలలోని ప్రజలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని వైద్యాధికారి డా. ఓంకార్ నాథ్ అన్నారు. తద్వారా ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో విల్సన్ బాబు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

May 31, 2026 / 12:10 PM IST

గండి దేవస్థానం ఈవోగా విశ్వనాథ్

కడప జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం గండి వీరాంజనేయ స్వామి దేవాలయం ఈవోగా విశ్వనాథ్ నియమితులయ్యారు. అన్నమయ్య జిల్లా ఎండోమెంట్ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న విశ్వనాథ్కు గండి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం గండి ఈవోగా బాధ్యతలు చూస్తున్న కర్నూల్ ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్ నేడు రిటైడ్ అవుతున్నారు.

May 31, 2026 / 12:10 PM IST

MLA రవికుమార్ రేపటి పర్యటన వివరాలు

SKLM: ఆమదాలవలస MLA రవికుమార్ సోమవారం ఉ.7 గంటలకు ఆమదాలవలస మండలం 12వ వార్డులో లబ్దిదారులు ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉ 8 గంటలకు సరుబుజ్జిలి మండలం గోనెపాడులో NTR భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు. మ.3 గంటలకు MLA క్రికెట్ కప్ ఫైనల్స్ విజేతలకు బహుమతులు అందజేస్తారు అని MLA కార్యాలయం ఆదివారం ప్రకటనలో తెలిపారు.

May 31, 2026 / 12:09 PM IST

జూన్ 1న కార్మికులకు శిక్షణ కార్యక్రమం

అనకాపల్లి: నాతవరం మండలంలోని అన్ని పాఠశాలల కుకింగ్ కం హెల్పర్లకు జూన్ 1న శిక్షణా కార్యక్రమంతో పాటు వంటల పోటీలు నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి వరహాలబాబు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం నాతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరగనుందన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలపై అవగాహన కల్పించడంతోపాటు పోటీలు నిర్వహిస్తామన్నారు.

May 31, 2026 / 12:08 PM IST