• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం ఆలయ వెబ్‌సైట్ అప్‌డేట్ చేయండి: కమిషనర్

NDL: శ్రీశైలం ఆలయ వెబ్‌సైట్ ఆర్జిత సేవలు, పూజలు, అలంకరణల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ ఓ ప్రకటనలో ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఆలయ విశేషాలు, సౌకర్యాల సమాచారం ఆన్‌లైన్ అందుబాటులో ఉంచాలని ఈవోను ఆదేశించారు. దీనివల్ల సమాచార సేకరణ భక్తులకు మరింత సులభతరం కానుంది.

April 27, 2026 / 08:49 AM IST

లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

KDP: పెడ్లిమర్రి(M)లోని చిన్నదాసరపల్లెలో ప్రసిద్ధిచెందిన వేయినూతులకోన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 నుంచి మే 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త పి. నరసింహ హరిప్రసాద్ తెలిపారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.

April 27, 2026 / 08:38 AM IST

ఇంధనంపై వదంతులు నమ్మొద్దు: ఎస్పీ

BPT: జిల్లాలో ఇంధన కొరతపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ సూచించారు. సోషల్ మీడియా ద్వారా పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. కృత్రిమ సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

April 27, 2026 / 08:36 AM IST

రేపు కోసిగి మండల సర్వసభ్య సమావేశం

KRNL: కోసిగి ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 28న ఎంపీపీ ఈరన్న అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఎస్. మహబూబ్ బాషా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో 16 రకాల అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మండలంలోని అన్నీ శాఖల అధికారుల ప్రగతి నివేదికలను ఇవాళ సాయంత్రంలోగా ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలన్నారు.

April 27, 2026 / 08:34 AM IST

రాయచోటి క్రికెటర్‌కు ఏపీఎల్‌లో అవకాశం

అన్నమయ్య: రాయచోటికి చెందిన బౌలర్ మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో కాకినాడ కింగ్స్ జట్టుకు రూ.4 లక్షలకు ఎంపికయ్యారు. టీ20ల్లో 23 మ్యాచ్‌లలో 28 వికెట్లు తీసిన ఆయన, గతంలో ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున కూడా ఎంపికయ్యారు. అలాగే లిస్ట్-Aలో 15 మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు సాధించారు. ఈ అవకాశంతో ఆయన కెరీర్‌కు మరో మెట్టు ఎక్కినట్లైంది.

April 27, 2026 / 08:28 AM IST

ఒంగోలు పట్టణంలో ఘరానా చోరీ

ప్రకాశం: ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఘరానా చోరీ చోటుచేసుకుంది. పూర్ణచంద్రరావు అనే వ్యక్తికి చెందిన ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 16 తులాల బంగారాన్ని అపహరించారు. వ్యక్తిగత పనులపై వేరే ప్రాంతానికి వెళ్ళిన పూర్ణచంద్రరావు అతని భార్య ఇంటికి వచ్చి చూసేసరికి చోరీ జరిగిందని గమనించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

April 27, 2026 / 08:28 AM IST

ఒకే ఈతలో నాలుగు మేకపిల్లలు జననం

NDL: జుపాడుబంగ్లా మండలంలోని పోతులపాడు గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తికి చెందిన మేక ఒకే ఈతలో 4 పిల్లలకు జన్మ నిచ్చింది. గతేడాది కూడా ఇదే మేక మూడుపిల్లలకు జన్మనిచ్చింది. గత ఐదురోజుల కిందట నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన పిల్లలన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన తెలి పారు. నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన మేకను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురైతున్నారు.

April 27, 2026 / 08:25 AM IST

1500 గ్రాముల పసుపుతో శ్రీవారి పాదాలు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నంద్యాలకు చెందిన ఉమాదేవి తన భక్తిని చాటుకుంది. సోమవారం సాయంత్రం ఆలయం వద్దకు శ్రీవారి పాదాలను ప్రతిరూపంగా సుమారు 1500 గ్రాముల పసుపుతో తయారు చేసి పూలతో అందంగా అలంకరించి తీర్చిదిద్దింది. ఆలయ పరిసరాల్లో ఈ అపూర్వ దృశ్యం భక్తులను ఆకట్టుకుని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉజ్వలంగా మార్చింది.

April 27, 2026 / 08:21 AM IST

డీజిల్ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్

GNTR: మంగళగిరి మండలం ఆత్మకూరులోని పెట్రోల్ బంకులను కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన సరఫరా సమృద్ధిగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. 

April 27, 2026 / 08:20 AM IST

‘ఇంధన సమస్యలపై కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్’

ప్రకాశం: జిల్లాలో ఇంధన సరఫరా సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ కోసం కలెక్టర్ రాజాబాబు ఫ్యూయల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఇంధన కొరత, అధిక ధరలు, నాణ్యత సమస్యలపై ప్రజలు 1077 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ టోల్ ఫ్రీ నంబర్ 24 గంటలు పనిచేస్తుందని, ఇంధన సమస్యలపై మాత్రమే ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ తెలిపారు.

April 27, 2026 / 08:20 AM IST

సామాన్యుడిలా బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే

ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో గత రాత్రి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మినీ బస్టాండ్‌ను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బస్సు షెల్టర్ ప్రారంభించిన అనంతరం సామాన్యుడిలా టికెట్ తీసుకుని ధర్మాజీగూడెం నుంచి ఏలూరు రోడ్ వరకు పల్లెవెలుగు బస్సులో ప్రయాణిస్తూ.. ప్రయాణికులను ఆత్మీయంగా పలకరించారు.

April 27, 2026 / 08:14 AM IST

నేడు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటన వివరాలు

కోనసీమ: నేడు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 9 గంటలకు అంబాజీపేట మండలం చిరుతపూడి సొసైటీ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు పి.గన్నవరం మండలం మానేపల్లి వద్ద 1.48 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారు అని తెలిపారు.

April 27, 2026 / 08:13 AM IST

జిల్లా వ్యాప్తంగా వాహనాల కేసులు నమోదు : SP

కడప జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం సాయంత్రం వాహనాల తనిఖీ ముమ్మరంగా చేపట్టినట్లు ఎస్పీ నచికేత్ తెలిపారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని 197 మందిపై కేసులను నమోదు చేయడం జరిగిందని, రూ. 50,175 జరిమానా విధించామన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.

April 27, 2026 / 08:11 AM IST

నేటి నుంచి శ్రీ పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు

NDL: కోవెలకుంట్లలో వెలసిన పురాతన ప్రసిద్ధ శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ చిన్న వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. 27న పేట తిరునాళ్ల, 28న కోనేటి తిరునాళ్ళ, 29న రథోత్సవం, కళ్యాణం నిర్వహిస్తామని వెల్లడించారు.

April 27, 2026 / 08:10 AM IST

LTP అసోసియేషన్ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి

తూ.గో: రాజమండ్రి 45వ డివిజన్ R&B వాంబే గృహాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన LTP అసోసియేషన్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అభివృద్ధికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

April 27, 2026 / 08:10 AM IST