కడప: ప్రజల అవసరాల దృష్ట్యా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్లకు సంబంధించిన పోస్టర్లను ఏర్పాటు చేసినట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. రాయచోటి కలెక్టరేట్లో టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్లకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఈ పోస్టర్లు ఏర్పాటు చేశారు.