KRNL: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో నవంబరు 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ మాసోత్సవాలకు వివిధ విస్తృత ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఇన్ఛార్జ్ కార్యనిర్వహణాధికారి ఈ.బ చంద్రశేఖరరెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ఆయా ఏర్పాట్లను పరిశీలించారు.