WG: నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం శ్రీకోట సత్తెమ్మ అమ్మవారి క్షేత్రంలో ఆదివారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఉత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించారు. అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని మంత్రి దుర్గేష్ తెలిపారు.