VSP: విశాఖలోని జైలు రోడ్డు వద్ద ఉన్న SBI బ్యాంక్లో గురువారం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీస్, అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. బ్యాంక్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. షార్ట్ సర్క్యూట్ వలనే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని సిబ్బంది ప్రాధమిక ధర్యాప్తులో తెలిపారు.