NTR: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రేపు పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 9 గంటల నుంచి జి.కొండూరు మండలంలోని వెలగలేరు, చెవుటూరు, జి.కొండూరు, పినపాకలో పర్యటిస్తారని అన్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి విజయవాడ రూరల్ మండలంలోని రాయనపాడు, పైడూరుపాడు, జక్కంపూడి, షాబాద్, కొత్తూరు, తాడేపల్లిలో పర్యటిస్తారని తెలిపారు.