SKLM: ఈదుపురంలో శుక్రవారం జరగనున్న ముఖ్య మంత్రి చంద్రబాబు సభకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు బుధవారం సాయంత్రం హెలీపాడ్ పనులను SP మహేశ్వరరెడ్డి పరిశీలించారు. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీ ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో సంభాషించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.