KRNL: కర్నూలు ట్రాఫిక్ CI మనసురుద్దీన్ ఆధ్వర్యంలో సౌండ్ పొల్యూషన్పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అతిగా శబ్దం కలిగిస్తూ ఇతర వాహనదారులు, ప్రజలను భయపెడుతున్న 10 మందిని గుర్తించారు. వారి బైకుల సైలెన్సర్లను తొలగించి.. వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. కర్నూలు ఎస్పీ జి.బిందు మాధవ్, DSP బాబు ప్రసాద్ సూచనలతో డ్రైవ్ చేపట్టామని సీఐ తెలిపారు.