BPT: నందిరాజు తోట సబ్ స్టేషన్లో నూతన బ్రేకర్ ఏర్పాటు కారణంగా బాపట్ల పట్టణంలోని పలు ప్రాంతాలలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈఈ సాయి శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 11గంటల వరకు అక్బర్ పేట, మున్సిపల్ ఆఫీస్, తవ్వ కలువ, అగ్రహారం, యాదవ పాలెం, చీల్ రోడ్డు, శ్రీనివాస్ నగర్, కలెక్టరేట్ ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు.