ప్రకాశం: జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా శనివారం జూదం శిబిరాలపై పోలీసు అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మార్కాపురం రూరల్ రాయవరంలో జూదం ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.1,460 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే డయల్ 100 చేయమన్నారు.