కర్నూలు: దేవనకొండ మండలంలోని కప్పట్రాలలో ప్రకృతి వ్యవసాయంతో వేసిన పండ్ల తోటల పెంపకాలను వ్యవసాయాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండ్లతోటలు వేసిన తర్వాత మూడేళ్లకు పంట కోతకు వస్తుందన్నారు. మూడేళ్ల వరకు పండ్ల తోటల మధ్య అంతర పంటలు కూడా వేసుకోవచ్చని సూచించారు. పండ్ల తోటలతో అధిక లాభాలు సాధించవచ్చని రైతులకు వ్యవసాయాధికారులు సూచించారు.