ELR: అనుమతి లేకుండా బాణాసంచా దుకాణాలు ఏర్పాటుచేసే వారిపై కేసులు నమోదు చేయాలని ఏలూరు తహసీల్దార్ జి.శేషగిరి అధికారులను ఆదేశించారు. దీపావళి సందర్భంగా బాణాసంచా దుకాణాల అనుమతులు, భద్రతా చర్యలు, వంటి అంశాలపై సంబంధిత అధికారులతో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఆయన సమీక్షించారు. బాణాసంచా దుకాణాల ఏర్పాటు, నిల్వ కేంద్రాలకు అనుమతులు తీసుకోవాలన్నారు.