VZM: జిల్లాలో దీపావళి సందర్భంగా బాణాసంచా విక్రయాల కోసం నిబంధనలు పాటించిన వారికే అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏ షాపు ఏర్పాటుకూ అనుమతులు మంజూరు చేయవద్దని స్పష్టం చేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులతో మాట్లాడారు.