కృష్ణ: రాష్ట్రంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని ఏపీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన సమావేశంలో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 2012లో వీఆర్వోల నియామకం జరిగిందని, నాటి నుంచి నేటి వరకు ప్రమోషన్లకు నోచుకోలేదని పేర్కొన్నారు.