ELR: బాణాసంచాను అనుమతి లేకుండా విక్రయించడం, నిల్వ ఉంచడం చట్టరీత్యా నేరమని ఆదివారం చింతలపూడి ఎస్సై కుటుంబరావు తెలిపారు. ఈ సందర్భంగా అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీవో అనుమతులు పొందిన తర్వాత మాత్రమే బాణసంచాను విక్రయించాలన్నారు. గృహాల మధ్య బాణాసంచా నిల్వ ఉంచారని తెలిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలన్నారు.