ATP: 100 బీసీ హాస్టళ్లలో ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. బీసీ హాస్టళ్లను తరుచూ విజిట్ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, బీసీ కులాల వృత్తుల్లో నైపుణ్యం పెంచి జీవనోపాధి పెంపొందించేలా ఆర్థిక చేయూత అందిస్తామన్నారు.