AKP: ప్రభుత్వం ఉచిత ఇసుకపై ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని సీపీఎం మండల కన్వీనర్ శ్రీరామ్ డిమాండ్ చేశారు. గురువారం అనకాపల్లిలో బిల్డింగ్ వర్కర్స్‌తో కలిసి గురువారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తామని అధికారంలోకి వచ్చి తీరా ఇప్పుడు రవాణా చార్జీలు పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు.