KDP: బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంటలో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ. వెయ్యి పెన్షన్ పెంచుతూ.. పెన్షన్ దారులకు అందివ్వడం జరిగిందన్నారు.