GNTR: మంగళగిరి మిడ్వాలి సిటీ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ వాసులతో ఎస్సై సీహెచ్ వెంకట్ శనివారం రాత్రి సమావేశం నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ.. అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. రాత్రిపూట సెల్లార్లలో ఉండే డ్రైవర్ల వివరాలు, వారి కదలికలు పరీక్షించే విధంగా సెక్యూరిటీ అప్రమత్తంగా ఉండాలన్నారు.