E.G: రాజమండ్రి రెవిన్యూ డివిజనల్ అధికారిగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కృష్ణ నాయక్‌ను గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజనల్ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు కలిశారు. ఈ సందర్భంగా అనంతరావు మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాదీనం చేసుకోవాలని, అట్రాసిటీ కేసులపై దృష్టిసారించాలి కోరారు.