»Undavallis Shocking Comments Do Not Criticize Jagan
Undavalli : జగన్ పై విమర్శలు చేయను ఉండవల్లి షాకింగ్ కామెంట్స్..!
జగన్ ప్రభుత్వంపై తాను ఎలాంటి విమర్శలు చేయాలని అనుకోవడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar)షాకింగ్ కామెంట్స్ చేశారు. విమర్శలు ఎందుకు చేయవు అని అడే అర్హత ఎవరికీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
రామోజీరావు మార్గదర్శి అక్రమాలు-నిజానిజాలు అనే అంశంపై విజయవాడలో స్వర్ణాంధ్ర పత్రిక ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్ పునర్విభజన విషయంలో సీఎం జగన్ (CM Jagan) ప్రభుత్వం అఫిడవిట్ వేయడం తనకు బలాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు. తనపై ఎంత దుష్ప్రచారం చేసినా జరగాల్సింది జరిగి తీరుతుంది అన్నారు. టీడీపీ (TDP) ప్రభత్వ అక్రమాలు కొందరికి కనబడవు అని.. రాష్ట్ర పునర్విభజన చట్టంపై కేసు వేస్తే, టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు అఫిడవిట్ వేయలేదన్నారు. అఫిడవిట్ వేయకపోతే జగన్ కు, చంద్రబాబుకు తేడా ఉండదని మార్గదర్శి అంశంపై ప్రభుత్వం తరపున అఫిడవిట్ వేశారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకంగా అఫిడవిట్ వేస్తుందనే భయంతో తెలంగాణ (Telangana) ప్రభుత్వంపై, అక్కడి నూతన సచివాలయంపై పొగడ్తలు కురిపిస్తున్నారన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అనేది పచ్చి అబద్ధం.. డబ్బులున్న వాళ్లకి చట్టం చుట్టంగా మారిందన్నారు.రామోజీరావు తాను చట్టాలను పట్టించుకోనంటారని.. చట్టాలకు అతీతమన్నట్లుగా వ్యవహరిస్తారని ఉండవల్లి నిప్పులు చెరిగారు. తనను ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదని రామోజీరావు(Ramoji Rao) వాదిస్తారని తప్పుబట్టారు. తాను ఆర్థిక అక్రమాలకు పాల్పడినా ఎవరూ అడగకూడదనే వితండవాదం రామోజీదన్నారు. గత 60 ఏళ్లుగా తన అక్రమాలను ఎవరూ ప్రశ్నించలేదు కాబట్టి ఇప్పుడూ అడగడానికి వీల్లేదని రామోజీరావు భావిస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.