»Sensational Comments Of Mla Kotamreddy On Intelligence Chief
AP Intelligence : ఇంటెలిజెన్స్ చీఫ్‌పై ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ (AP Intelligence Chief) సీతారామాంజనేయులుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి (MLA Kotam Reddy) శ్రీదర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక రాజకీయ దళారీగా మారారని కోటంరెడ్డి త్రీవ స్థాయిలో విమర్శించారు.ఆయన వ్యవహారశైలి బాగోలేదన్నారు.ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) తో రామోజీరావుపై ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టించేందుకు రామాంజనేయులు ప్రయత్నిస్తున్నారని కోటంరెడ్డి ఆరోపించారు.
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ (AP Intelligence Chief) సీతారామాంజనేయులుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి (MLA Kotam Reddy) శ్రీదర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక రాజకీయ దళారీగా మారారని కోటంరెడ్డి త్రీవ స్థాయిలో విమర్శించారు. ఆయన వ్యవహారశైలి బాగోలేదన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) తో రామోజీరావుపై ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టించేందుకు రామాంజనేయులు ప్రయత్నిస్తున్నారని కోటంరెడ్డి ఆరోపించారు. వైసీపీ (YCP) ట్రాప్ లో పడొద్దని ఉండవల్లికి ఆయన సూచించారు. మార్గదర్శి (Margadarsi)పై అక్రమ కేసులు పెట్టి రామోజీరావు(Ramoji Rao)ని, ఆయన కుటుంబసభ్యులను వేధిస్తున్నారని కోటంరెడ్డి వాపోయారు. మార్గదర్శి వల్ల నష్టపోయాము అంటూ కనీసం ఒక్కరైనా పోలీసులకు ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ తన డ్యూటీ మరిచి ప్రతిపక్ష నేత చంద్రబాబు(Chandrababu), జనసేన అధినేత పవన్ (Pavan kalyan) ఇతర పార్టీల కార్యకలాపాలను పోలీస్ బలంతో అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
రామోజీరావు గురించి వైసీపీ నేతలు చెప్పే మాటలు ఢిల్లీలో ఎవరూ వినడం లేదని, అందుకే ఈ వ్యవహారంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ని వాడుకోవాలని వైసీపీ నేతలు చూస్తున్నారని కోటంరెడ్డి అన్నారు. కాగా, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పై కోటంరెడ్డి తీవ్ర ఆరోపణలు చేయడం ఇది తొలిసారి కాదు. గతంలోనే ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేసిన కోటంరెడ్డి, ఆ సమయంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు (Sitaramanjaneys)పై సంచలన ఆరోపణలు చేశారు. ఆ సమయంలో తనకు ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి ఫోన్ వచ్చిందన్నారు కోటంరెడ్డి. ఇప్పుడు మరోసారి ఇంటెలిజెన్స్ చీఫ్ టార్గెట్ గా కోటంరెడ్డి చెలరేగిపోయారు. రాజకీయ దళారి అంటూ ఇంటెలిజెన్స్ చీఫ్ పై విరుచుకుపడ్డారు. అధికార పార్టీ రాజకీయ ప్రత్యర్థులను, ఉద్యోగులను వేధిస్తున్నారని తెలిపారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ను ఉద్దేశించి కోటంరెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కోటంరెడ్డి చెప్పినట్లుగా ఉండవల్లిని వైసీపీ నేతలు వాడుకుంటున్నారా? ఆయన రామోజీరావుపై ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టబోతున్న విషయం నిజమేనా? అనేది ఆసక్తికరంగా మారింది.