టీడీపీ అధినేత చంద్రబాబు గెస్ట్ హౌస్ సీఐడీ (CID) అటాచ్మెంట్ పై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమాలకు చిరునామా కరకట్ట మీద ఉన్న చంద్రబాబు (Chandrababu) ఇల్లు.. ఆ అక్రమ కట్టడంలో బాబు ఏ హోదాలో ఉంటున్నారో అర్థం కాదని సజ్జల ఆరోపించారు. మాజీ సీఎం చంద్రబాబుకు రాష్ట్రం ప్రభుత్వం గట్టి షాక్‌నే ఇచ్చింది. రాజధాని మాస్టర్‌ప్లాన్(Masterplan)లో అక్రమాలు కేసు విషయంలో హైకోర్టు స్టే పై సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా ఉత్తర్వులు రావడంతో ప్రభుత్వం వేగంగా కదిలింది. ఉండవల్లి కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని ప్రభుత్వం అటాచ్ చేసింది. రాజధాని మాస్టర్ ప్లాన్‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్విడ్ ప్రో కో(Quid Pro Co)కు పాల్పడ్డారని అందుకు ప్రతిఫలంగా ప్రస్తుతం కరకట్టపై తాను నివాసం ఉంటున్న ఇంటిని లింగమనేని సంస్థ నుంచి పొందారని ఉత్తర్వుల్లో తెలిపింది.
చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటితో పాటు.. అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ (Narayana) సన్నిహితుల ఆస్తులను అటాచ్ చేస్తూ.. రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. శుక్రవారమే జీవో ఇచ్చినప్పటికీ ఇప్పుడు బయటకు వచ్చింది. రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ (Cider Trading) జరిగిందని… మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్టారెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వం సీఐడీతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సీఐడీ విచారణ చేపట్టి మాజీ మంత్రి నారాయణ తన విద్యాసంస్థల ఉద్యోగుల పేర్లతో రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారని..దీనికి అప్పటి సీఎం చంద్రబాబు తోడ్పాటు ఉందని ఆరోపిస్తూ కేసులు నమోదు చేసింది. చంద్రాబబు, నారాయణను A1, A2గా చేర్చారు. అయితే రాజధానిలో ఇన్ సైడర్ ట్రైడింగ్ కు ఆస్కారం లేదంటూ హైకోర్టు (High Court) దర్యాప్తుపై స్టే విధించింది. దీనిని సుప్రీం కోర్టు నిలిపేసింది.