ఏలూరు రైల్వే స్టేషన్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. గురువారం రాత్రి రైలులో తనిఖీలు చేస్తుండగా ఒక బ్యాగులో 18 కేజీల గంజాయి లభించింది. ఈగల్ టీం సభ్యుడు ఉదయ్ భాస్కర్, ఎస్సై దుర్గాప్రసాద్ ఈ సోదాల్లో పాల్గొన్నారు. గంజాయిని సీజ్ చేసిన పోలీసులు, పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు. రైల్వే స్టేషన్లో నిఘా పెంచామని తెలిపారు