Pawan Kalyan will never be CM:Minister Jogi Ramesh
Minister Jogi Ramesh:వచ్చే ఎన్నికలు, సీఎం అభ్యర్థిని కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) తీవ్రంగా స్పందించారు. పూజకు పనికిరాని పువ్వులు ఉంటాయని.. రాజకీయాలకు పనికి రాని వ్యక్తులు కొందరు ఉంటారని చెప్పారు. పవన్ కల్యాణ్ కూడా అలాంటి వారేనని మండిపడ్డారు. మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే పేర్ని నాని కూడా పవన్ కామెంట్లపై విరుచుకుపడ్డారు.
పార్టీ ఏర్పాటు చేసే సమయంలో బల, బలాలు, అభ్యర్థుల గురించి ఆలోచించాలని మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) సూచించారు. పార్టీ ఏర్పాటు చేసి పదేళ్లు అవుతున్న అలాంటి ఆలోచన చేయడం లేదని అంటున్నారు. 2014లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసి.. చంద్రబాబును గెలిపించావని అన్నారు. 2019లో ఓట్లు చీలకుండా ఉండేందుకు విడిగా పోటీ చేశావని.. నీ బలం ఏంటో నీకు తెలుసు అన్నారు.
రెండు చోట్ల పోటీ చేసి.. ఒక చోట కూడా గెలవలేదని గుర్తుచేశారు. గెలవలేని వ్యక్తి.. ఈ రోజు సీఎం జగన్‌ను ఓడించాలనడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్‌కు చంద్రబాబు వద్ద ఊడిగం చేయాలనే తప్ప.. దమ్ము, ధైర్యం లేదన్నారు. ధైర్యంగా సీఎం అభ్యర్థిని అని చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు.
రాజమండ్రిలో సీఎం అని నినాదాలు చేస్తే.. ముఖ్యమంత్రి అయిన తర్వాత చేయాలని చెప్పారని.. నిన్న మాత్రం సీఎం కాలేను.. ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని అంటున్నారని జోగి రమేశ్ (Jogi Ramesh) గుర్తుచేశారు. పవన్ రాజకీయాలకు పనికిరాడని.. ప్యాకేజీకి తప్ప దేనికి తలవంచడన్నారు. పొత్తు పెట్టుకుంటే 4 సీట్లు గెలుస్తాడు కావొచ్చు.. కానీ పవన్ కల్యాణ్ ఎప్పటికీ సీఎం కాలేడని జోగి రమేశ్ (Jogi Ramesh) స్పష్టం చేశారు.
డబ్బులు తీసుకొని షూటింగ్ చేస్తే బలం పెరుగుతుందా అని మరో మంత్రి అంబటి రాంబాబు (ambati Rambabu) అన్నారు. చంద్రబాబుకు పవన్ అమ్ముడుపోయారని అంబటి విమర్శించారు. ఎన్నికలకు ముందే ఆయన చేతులెత్తేశారని పేర్కొన్నారు.చంద్రబాబు కోసం కాపులు పెద్దన్న పాత్ర పోషించాలా అని అడిగారు.