Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. లోక్సభ ఎన్నికల (Lok sabha election 2024)కు సిద్ధమవుతున్న బీజేపీ (BJP) ఇవాళ సాయంత్రం ఎన్డీఏ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జనసేన అధినేత ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా పులువురు జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.
ఓ ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని, ఎన్నికల ఫలితాలను బట్టి ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తామని పవన్ అన్నారు. రాష్ట్రానికి, తమకు అండగా నిలిచేవారే అధికారంలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు బీజేపీ, టీడీపీతో కలిసే జనసేన పోటీ చేస్తుందని తెలిపారు.