NTR: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో ఫిబ్రవరి 4 నుంచి 21 వరకు జరిగిన హుండీ లెక్కింపు ద్వారా రూ. 2,89,12,052ల ఆదాయం వచ్చినట్లు ఏఓ సీనా నాయక్ తెలిపారు. ఇందులో 171 గ్రాముల బంగారం, 2.88 కిలోల వెండి లభించాయి. రోజుకు సగటున రూ. 17 లక్షల ఆదాయం నమోదైంది. భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయం గణనీయంగా పెరిగిందని అధికారులు వెల్లడించారు.
CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆలయ క్యూలైన్లు నిండి బయటి వరకు భక్తులు వేచి ఉన్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈవో పెంచల కిశోర్ స్పష్టం చేశారు.
KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 పరిధి పార్వతీపురంలో పైపులైను లీకేజీ అయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలుషిత నీరు సరఫరా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 నెలలు కావస్తున్నా అధికారులు పట్టించుకోలేదని పలువురు చెబుతున్నారు. లీకేజీ ప్రాంతం బురదమయం కావడంతో కష్టంగా ఉందని వాహనదారులు తెలిపారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
NDL: పాణ్యం మండలం ఎస్ కొత్తూరు గ్రామంలో ఇవాళ దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ పర్యటించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చంద్రశేఖర్ ఆజాద్ చేరుకోగానే ఆలయ అధికారులు అర్చకులు కలిసి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
W.G: నరసాపురం మండలం సరిపల్లి శివారులో శనివారం పోలీసులు జరిపిన దాడిలో ఐదుగురు పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ. 8,760 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్సై టి. వెంకట సురేశ్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో జూదం ఆడుతూ చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
KRNL: AITUC 21వ జిల్లా మహాసభలు ఆలూరులో మార్చి 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి ఎస్. మునెప్ప శనివారం తెలిపారు. ఈ మహాసభలకు కార్మిక లోకం పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మిగనూరులోని సీపీఐ కార్యాలయం ముందు మహాసభల కరపత్రాలను విడుదల చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు కోరారు.
GNTR: ఆస్తి పన్ను, బకాయిలు చెల్లించడానికి ఆదివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో పన్ను చెల్లింపు కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 వరకు యధావిధిగా పనిచేస్తాయని GMC కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు. బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
VZM: చీపురుపల్లి పట్టణంలోని పిల్లపేటలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ శనివారం పర్యటించారు. నాయకులు, కార్యకర్తలతో సమావేశమై వైసీపీ గ్రామ, అనుబంధ కమిటీల నియామకంపై చర్చించారు. పార్టీ బలోపేతానికి కమిటీలు అత్యంత కీలకమని, వార్డుల వారీగా బాధ్యతగా పనిచేసి కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కష్టపడిన వారికి కమిటీల్లో చోటు కల్పించాలన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని MLA పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. శనివారం సత్యసాయి జిల్లా ఎన్జీవో సంఘం నాయకులు ఎమ్మెల్యేను, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎన్జీవో భవన నిర్మాణానికి సహకరించాలని వారు కోరారు. CM దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ATP: రాప్తాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఆమె స్వయంగా చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి ఆసుపత్రిలోని సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చీపురుపట్టి పరిసరాలు శుభ్రం చేశారు.
E.G: దేవరపల్లి మండల వైసీపీ ఉపాధ్యక్షుడిగా దేవరపల్లి గ్రామానికి చెందిన దుర్గారావు నేడు నియమితులయ్యారు. వైసీపీ పార్టీలో మొదటి నుంచి కష్టపడే నాయకుడిగా పేరు ఉన్న దుర్గారావుకు ఈ పదవి దక్కడం పట్ల దేవరపల్లి పట్టణ అధ్యక్షుడు గంగాధర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పదవి రావడానికి కారకులైన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
CTR: పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని బైరెడ్డిపల్లి ఎంపీడివో ఉపేంద్ర శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అకౌంట్స్ సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తూ ప్రమోషన్ పై బైరెడ్డిపల్లి ఎంపీడివోగా ఇక్కడికి వచ్చారు. విధుల్లో చేరిన అనంతరం అసెంబ్లీ సమావేశాల నుంచి విచ్చేసిన ఎమ్మెల్యేను ఆయన కార్యాలయంలో కలసి సన్మానించారు.
ELR: ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలను రాజకీయ ప్రదర్శనలకు వినియోగించడం అత్యంత నీచమైన పని అని ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు అన్నారు. శనివారం ఉంగుటూరు శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడి, తీవ్రంగా ఖండించారు.
VSP: కేజీహెచ్‌లో ‘జీరో వేస్ట్–లిటిల్ గవర్నెన్స్’ థీమ్‌పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఐ. వాణి ఆధ్వర్యంలో డాక్టర్లు, నర్సులు, నర్సింగ్ విద్యార్థులు, సిబ్బంది ర్యాలీ చేపట్టారు. పాల్గొన్న వారితో పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు.
VZM : గంజాయి రవాణకు పాల్పడినా, వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతోపాటు, చెక్ పోస్టులను బలోపేతం చేసామని తెలిపారు. గంజాయి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే 1972కు సమాచారం అందించాలన్నారు.