• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘అవసరానికి మించి యూరియా వినియోగం వద్దు’

KDP: వల్లూరు సొసైటీ బ్యాంకులో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి అధికారులతో కలిసి పాల్గొన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా యూరియా అందించాలని అధికారులకు సూచించారు. అవసరానికి మించి యూరియా వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై మూడపత్రాన్ని ఆవిష్కరించారు. అగ్రికల్చర్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

February 21, 2026 / 01:13 PM IST

పసిబిడ్డ ప్రాణాలను కాపాడిన ఎమ్మెల్యే మద్దిపాటి

E.G: గోపాలపురం నియోజకవర్గంCH పోతేపల్లికి చెందిన యర్రంశెట్టి యేసు – ఝాన్సీ రాణి దంపతులకు పుట్టిన 10 రోజుల పసిబిడ్డ ఊపిరితిత్తులు అభివృద్ధి చెందక ప్రాణాపాయ స్థితిలో ఉంది. చాలాఖర్చవుతుందని వైద్యులుతెలపడంతో ఆ కుటుంబం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఈ విషయాన్నిఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దృష్టికి తీసుకెళ్లగా శనివారం రూ.3,02,729 ఎల్ఓసీ మంజూరు చేయించారు.

February 21, 2026 / 01:12 PM IST

డిగ్రీ కళాశాలలో ఘనంగా మాతృభాషా దినోత్సవం

SKLM: ఆమదాలవలస మండలం తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డా. జి. రవికుమార్ మాట్లాడుతూ భావ వ్యక్తీకరణకు మాతృభాష కీలకమని, ప్రపంచ భాషలలో తెలుగు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 01:12 PM IST

ఘనంగా అంతర్జాతీయ మాతృబాషా దినోత్సవ వేడుకలు

W.G: భీమవరం సివి రామన్ స్కూల్లో శనివారం శ్రీవిజ్ఞాన వేదిక చార్టిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి., గోపాలశర్మ, డాక్టర్ రంగరాజు మాట్లాడుతూ.. భాషా వైవిధ్యాన్ని రక్షించుకోవడం కోసమే అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. సుబ్రహ్మణ్యం, సత్యనారాయణరాజు, నాగేశ్వరరావు,శర్మ, రాజబాబు,బాషా, పాల్గొన్నారు.

February 21, 2026 / 01:09 PM IST

కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి ప్రకటన

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఏపీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టు పరిశీలనలో ఉందని, అవసరమైన సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోర్టు భవనాల నిర్మాణానికి అదనంగా రూ.130 కోట్లు కేటాయించినట్లు మంత్రి ఇవాళ వెల్లడించారు.

February 21, 2026 / 01:06 PM IST

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

VZM: తెర్లాంకి చెందిన శనపతి రాము కుమార్తె జ్ఞానవర్షిణికు మంజూరైన సీఎం సహాయ నిధి రూ.1,00,000 చెక్కును ఎమ్మెల్యే బేబినాయన అందజేశారు. బొబ్బిలి కోటలో శనివారం చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు. పేదలకు సీఎం సహాయ నిధి ఎంతో దోహదం చేస్తుందని బేబినాయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా సీఎం సహాయ నిధి మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.

February 21, 2026 / 01:05 PM IST

పూతలపట్టులో స్వచ్ఛ రథం ప్రారంభం

CTR: స్వచ్ఛతపై అవగాహన కల్పించే లక్ష్యంతో స్వచ్ఛ రథాన్ని అందుబాటులోకి తెచ్చారు. పూతలపట్టు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కుమారి ఈ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ప్రజలందరూ పరిశుభ్రతకు కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. ఎంపీడీవో నాగరాజు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

February 21, 2026 / 01:04 PM IST

ఎమ్మెల్యే కార్యాలయానికి స్వామి వారి తీర్థప్రసాదాలు

సత్యసాయి: లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం నుంచి శ్రీస్వామి వారి తీర్థప్రసాదాలను ఆలయ ఛైర్మన్ రమానందన్ ఎమ్మెల్యే కార్యాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వాదాలు తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి విజయవంతంగా పూర్తయ్యాయని చెప్పారు.

February 21, 2026 / 12:58 PM IST

క్రీడా వికాస కేంద్రానికి నిధులు మంజూరు

కోనసీమ: మండపేట జూనియర్ కళాశాల ఆవరణలలో అసంపూర్తి నిర్మాణంలో ఉన్న క్రీడా వికాస కేంద్రాన్ని పూర్తిచేయుటకు రూ.1.41 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలియజేశారు. టెండర్లు పిలవటం జరిగిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అన్నారు. మండపేట నియోజకవర్గంలో యువతకు ఎటువంటి క్రీడా ప్రాంగణాలు లేనందున ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

February 21, 2026 / 12:52 PM IST

గుత్తి ఆర్టీసీ బస్టాండులో పట్టపగలే చోరి

ATP: గుత్తి ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం పట్టపగలే చోరీ జరిగింది. తాడిపత్రికి చెందిన మహిళా ప్రయాణికురాలు సంధ్యారాణి పత్తికొండ వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా ఆమె బ్యాగ్‌లో ఉన్న నాలుగు తులాల బంగారు ఆభరణాలను గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 21, 2026 / 12:50 PM IST

జిల్లాలో 6 మోడల్ సౌర గ్రామాలుగా అభివృద్ధి

NLR: సౌర వెలుగులతో గ్రామాలు వెలిగిపోనున్నాయి. PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన సోలార్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కలెక్టర్ హిమాన్షు శుక్లా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని లేగుంటపాడు, బిట్రగుంట, మహిమలూరు, కలివెలపాలెం, మనుబోలు, కాకుపల్లి వంటి 5 వేల మందికి పైగా జనాభా కలిగిన గ్రామాలను ఎన్నుకొన్నారు. ఉత్తమ ప్రదర్శన కనబర్చిన గ్రామాలకు రూ. కోటి కేంద్ర మంజూరు చేస్తుంది.

February 21, 2026 / 12:47 PM IST

గాల్లో ఎగురుతూ కరెంటు పనులు..!

WG: నరసాపురంలో విద్యుత్ శాఖ శనివారం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డ్రోన్ల సాయంతో 11 KV విద్యుత్ వైర్లను బిగించే పనులను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. 10 మంది కార్మికులు చేయాల్సిన కఠినమైన పనిని, డ్రోన్ సాయంతో కేవలం ఇద్దరు కార్మికులు పూర్తి చేశారు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, కార్మికులకు భద్రత పెరిగిందని ఈఈ మధుకుమార్ తెలిపారు.

February 21, 2026 / 12:47 PM IST

అక్కులగారిపల్లెలో ‘బండ లాగుడు’ పందేలు..!

KDP: లింగాల మండలం అక్కులగారిపల్లెలో హరిస్వామి ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకొని శనివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించనున్నారు. ‘న్యూ కేటగిరీ’ విభాగంలో జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆరు రకాల నగదు బహుమతులు అందజేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పోటీలో పాల్గొనే రైతులు శనివారం లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

February 21, 2026 / 12:46 PM IST

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

TPT: వెంకటగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతూ సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు ఈ సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి రూపాయి నేరుగా అర్హులైన బాధితులకు చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు.

February 21, 2026 / 12:45 PM IST

‘స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి’

BPT: మార్టూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పంచాయతీ సిబ్బందితో కలిసి ఆసుపత్రి పరిసరాలను, వార్డు గదులను శుభ్రం చేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

February 21, 2026 / 12:45 PM IST