TPT: సత్యవేడులో రెడ్ బుక్ డే సందర్భంగా శనివారం సీపీఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పెట్టుబడిదారీ విధానంలో అసమానతలు, దోపిడి పెరుగుతున్నాయని, సోషలిజమే దేశానికి ప్రత్యామ్నాయమని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. కార్మికులు, రైతుల సమస్యలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
NTR: నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో, పార్టీ కార్యకర్త నగిరికంటి రమేష్ కుమార్తె, కుమారుల నూతన వస్త్రాబహుకరణ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, పార్టీ నాయకులతో కలసి చిన్నారులకు అక్షింతలు వేసి ఆశీర్వదించి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
PLD: వినుకొండలో జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా ప్రసంగించారు. పల్నాడు గడ్డపై ప్రజల స్పందన చూస్తుంటే నియోజకవర్గానికి మంచి రోజులు రానున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి పౌరుషం, వైబ్రేషన్లు అద్భుతమని కొనియాడారు. ఇటీవల జరిగిన కోటప్పకొండ తిరునాళ్లను తాను స్వయంగా పర్యవేక్షించి విజయవంతం చేశామని గుర్తు చేశారు.
NLR: మండల కేంద్రమైన వరికుంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్యాధికారిని సుజాత తనిఖీ చేశారు. ఆమె రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు. కేటాయించిన లక్ష్యాలను నూరు శాతం సాధించాలన్నారు. వైద్యశాలకు వచ్చే రోగుల పట్ల స్నేహభావంతో మెలగాలన్నారు. సర్పంచ్ దిలీప్ కుమార్ పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు.
ATP: గుంతకల్లులోని భాష్యం స్కూల్లో 6వ తరగతి చదువుతున్న ప్రమోద్ కుమార్ అనే విద్యార్థి ఇటీవల జరిగిన NASO పోటీలలో అత్యంత ప్రతిభ కనిపించాడు. ఇండియా వైడ్ 9వ ర్యాంకు స్టేట్ వైడ్ 2వ ర్యాంకు సాధించాడు. శనివారం ఆ విద్యార్థిని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి తన చాంబర్లో శాలువాతో సత్కరించి సన్మానించి అభినందించారు.
AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో కొక్కిరాపల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో జీడి తోట దగ్ధం అయింది. స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియదని రైతులు తెలిపారు.
PPM: ఆర్ధిక స్వాతంత్య్రంతోనే మహిళలు ఆర్ధికంగా వృద్ధి చెందుతారని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఒకరిపై ఆధారపడకుండా తమకు తాము సంపాదించిన డబ్బులతో అవసరాలను తీర్చుకోవడమే ఆర్ధిక స్వాతంత్య్రం అని పేర్కొన్నారు. ఎవరిపై ఆధారపడనప్పుడే అనుకున్నవి సాధించగలరని, విజ్ఞానంతో పాటు సంపాదించుకునేందుకే చదువు అని అన్నారు.
ELR: స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ద్వారా తాటియాకులగూడెంలో గ్రామ పంచాయతీకి అందించిన పరిశుభ్రత వాహనం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. గ్రామ పరిశుభ్రత మెరుగుపడేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి గణ్ణమడుగు రవికుమార్, సర్పంచ్ వనమా రాంబాబు, పీడీవో ఆరేపల్లి చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.
SKLM: నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అశోక్ బాబు అన్నారు. శనివారం ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామపంచాయతీలో బలిజపల్లి జానకి ప్రభుత్వం కేటాయించిన భూమిలో నూతనంగా నిర్మించిన గృహాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వెంకటరావు అధికారులు , నాయకులు పాల్గొన్నారు.
NLR: 20 నెలల స్వల్ప కాలంలోనే కోవూరు నియోజకవర్గంలో 687 మంది అనారోగ్య బాధితులకు 7 కోట్ల 27 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. శనివారం 24 వ విడతగా 35 మందికి రూ. 55 లక్షల 42 వేల చెక్కులు అందించమన్నారు. వేలాది మందికి పునర్జన్మ ప్రసాదిస్తూ.. పేదల గుండెల్లో ధైర్యాన్ని నింపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
ASP: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళ డిగ్రీ కళాశాలల్లో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా జీరో లిట్టర్ గవర్నెన్స్‌పై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. చెత్త రహిత రాష్ట్రంగా మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యమని ప్రిన్సిపాల్స్ డా కేబీకే నాయక్, చలపతిరావులు తెలిపారు. పరిసరాలను శుభ్రపరిచే భాద్యత అందరిదీ అని అన్నారు.
మదనపల్లి పట్టణం నక్కలదిన్నె బీటీ కళాశాల మైదానంలో రూ.5 కోట్లతో ఇండోర్ స్టేడియం, మహిళలు-పురుషులకు వాకింగ్ ట్రాక్, జిమ్, పిల్లల కోసం చిన్న పార్క్ ఏర్పాటుపై అన్నమయ్య జిల్లా కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు. ప్రతిపాదిత పనులపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
NDL: ద్రోణాచలం సేవాసమితి ఆధ్వర్యంలో చిన్నారి పునర్విక చికిత్స కోసం సాంజో స్కూల్ విద్యార్థులు రూ.24,997 విరాళం శనివారం అందజేశారు. విద్యార్థులు తమ ఖర్చు డబ్బులు, పొదుపు మొత్తాలను చందాలుగా సమీకరించి పెద్ద మనసును చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ అనేట్, యాజమాన్యం, ఉపాధ్యాయులు సహకరించారు. సేవాసమితి సభ్యులు విద్యార్థులను అభినందించారు.
W.G: తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని అక్కడ బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ గురించి పరిశీలించడం జరిగింది. నాలుగు రంగుల చెత్త బుట్టలు-ఎరుపు, పసుపు, నీలం, తెలుపు ఏర్పాటు చేసి వచ్చిన వ్యర్థాలను తదనుగుణంగా తీసి సరైన పద్దతిలో డిస్పోజ్ చేసే విషయం గురించి పరిశీలించారు.
కోనసీమ: రాష్ట్రాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దడం, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అల్లవరంలో శనివారం స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు.