• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తాడిపత్రి మున్సిపాలిటీకి సొంత సోలార్ ప్లాంట్

ATP: తెలుగు రాష్ట్రాల్లోని మున్సిపాలిటీల చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి తాడిపత్రి వేదిక కాబోతోంది. తాడిపత్రి మున్సిపాలిటీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ఈరోజు భూమి పూజ చేయనున్నారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి రావడం ద్వారా మున్సిపాలిటీకి నెలకు సుమారు రూ.22 లక్షల విద్యుత్ బిల్లు ఆదా కానుంది.

February 20, 2026 / 11:19 AM IST

గుర్తింపు కార్డు ఉంటేనే ఏయూలోకి అనుమతి..!

VSP: గత కొన్ని రోజులగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంటున్న వరుస సంఘటనల నేపథ్యంలో అధికారులు భద్రతా చర్యలను పటిష్టం చేశారు. గుర్తింపు కార్డు కలిగిన వారిని మాత్రమే విశ్వవిద్యాలయంలోకి అనుమతిస్తున్నారు. విద్యార్థి సంఘాలు ఏబీవీపీ, ఎస్ఎఫ్ఎస్ఐ మధ్య వివాదం, అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీ చేసిన నిరాహార దీక్షలు నేపథ్యంలో భద్రతను పటిష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.

February 20, 2026 / 11:18 AM IST

అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్ల పరిశీలన

GNTR: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను మంత్రి సవిత సందర్శించారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నూతన డిజైన్లు, నాణ్యమైన ఉత్పత్తులను సమృద్ధిగా నిల్వ ఉంచాలని అధికారులకు ఆదేశించారు.

February 20, 2026 / 11:15 AM IST

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన

SKLM: రణస్థలం పంచాయతీ పరిధిలోని గొర్లె వీధిలో ఇంటింటికి కొళాయి ద్వారా తాగునీరు అందించే పనులకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. రణస్థలం పంచాయతీ సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

February 20, 2026 / 11:13 AM IST

అసెంబ్లీలో సిమెంట్ ఫ్యాక్టరీల భూములపై గళమెత్తిన యరపతినేని

PLD: సిమెంట్ ఫ్యాక్టరీల నిర్మాణం పేరుతో రైతుల వద్ద తక్కువ ధరకే భూములు కొన్న యాజమాన్యాలు, ఇప్పటికీ పనులు చేపట్టకపోవడంపై గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు అసెంబ్లీలో శుక్రవారం ధ్వజమెత్తారు. ఫ్యాక్టరీలు వస్తే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని రైతులు ఆశపడ్డారని, కానీ నేడు అటు పొలం లేక, ఇటు పరిశ్రమలు రాక రైతులు కూలీలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

February 20, 2026 / 11:13 AM IST

ఎమ్మెల్యే భానుప్రకాష్ చొరవతో ఆ రోడ్డుకి మహర్దశ

CTR: విజయపురం మండలంలో గత కొన్నేళ్లుగా గుంతలమయంగా ఉన్న ఈ రోడ్డుకు ఎమ్మెల్యే భానుప్రకాష్ చొరవతో మహర్దశ కలిగింది. విజయపురం మండలంలో ముత్యాలరెడ్డి కండ్రిగ, మంగళం మీదుగా విజయపురం వరకు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1.5 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీని పట్ల మండల కూటమి నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 20, 2026 / 11:05 AM IST

‘అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయించండి’

AKP: నర్సీపట్నంలో అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయించాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నేతల నాగేశ్వరరావు కోరారు. దళితులకు శుభకార్యాలు, సమావేశాల కోసం ప్రత్యేక స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పందించి భూమి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

February 20, 2026 / 10:55 AM IST

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మంత్రి

SS: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను పలువురు సందర్శకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు తమ ప్రాంతీయ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. మంత్రి వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

February 20, 2026 / 10:49 AM IST

శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో మాఘమాస పూజలు

ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మాఘమాసం మూడవ శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి మూలమూర్తికి పవిత్ర గంగాజలాలతో అభిషేకాలు నిర్వహించారు. మాఘమాస శుక్రవారాల్లో అమ్మవారిని ఆరాధించడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు, ఆర్థికాభివృద్ధి కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని దర్శించుకున్నారు.

February 20, 2026 / 10:48 AM IST

ఈనెల 23 నుంచి సైన్స్ సమగ్ర మహోత్సవం: డీఈవో

NLR: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ సమగ్ర మహోత్సవంలో భాగంగా సైన్స్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని 23వ తేదీ నుంచి నిర్వహించనున్నామని డీఈవో బాలాజీరావు తెలిపారు. ఇండియా, ఆసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు సాధించే దిశగా కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతి పాఠశాల నుంచి గరిష్టంగా పది టీంలు పాల్గొనవచ్చని చెప్పారు.

February 20, 2026 / 10:48 AM IST

కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రతిష్టకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

కృష్ణా: అవనిగడ్డలో నూతన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రతిష్ట ఈనెల 22వ తేదీ నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం అవనిగడ్డలోని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్వగృహంలో ఆయనను కమిటీ పెద్దలు ఘంటసాల రాజమోహనరావు (కన్నయ్య) కలిసి ఆహ్వాన పత్రిక అందచేశారు. ఆలయ ప్రతిష్టా మహోత్సవానికి కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానం పలికారు.

February 20, 2026 / 10:45 AM IST

‘బౌద్ధమత ఆనవాళ్లను వెలికి తీయండి’

VZM: బొబ్బిలి మండలం చిత్రకోట బొడ్డవలస వద్ద ఉన్న బౌద్ధమత ఆనవాళ్లను వెలికి తీయాలని ఎమ్మెల్యే బేబినాయన ప్రభుత్వాన్ని కోరారు. చిత్రకోటబొడ్డవలస పేరు చిత్రకోటబౌద్ధవలస అని, ఆ ప్రాంతంలో పూర్వం బౌద్ధులు నివాసం ఉండేవారన్నారు. బౌద్ధులు ఆనవాళ్లను వెలికి తీసి భద్ర పరచాలని కోరగా మంత్రి దుర్గేశ్ సానుకూలంగా స్పందించారు.

February 20, 2026 / 10:42 AM IST

‘ఈ నెల 22న నిర్వహించే 5కే రన్ పాల్గొనాలి’

E.G: ఈ నెల 22వ తేదీన రాజమండ్రి హ్యాపీ స్ట్రీట్ వద్ద 5కే రన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ ప్రముఖ టాలీవుడ్ నటులు భద్రం స్థానిక వెంకటేశ్వరనగర్ పార్క్, హ్యాపీ స్ట్రీట్, ఆర్ట్స్ కళాశాల మైదానంలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఫిట్‌నెస్ పెంచుకోవడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి 5కే రన్ ఉత్తమ మార్గం అన్నారు.

February 20, 2026 / 10:37 AM IST

కులవర్ధన్ తల్లికి షాక్

KDP: మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై కులవర్ధన్ హత్యాచారం చేయడం తెలిసిందే. ఆ కేసులో నిందితుడి తల్లి అంజలి A2గా మారింది. కాగా ఆమె వెంకటేశ్వరపురం స్కూల్లో ఆయాగా పనిచేసేది. నిందితురాలిగా ఉన్న ఆమెను ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో స్కూల్ హెచ్ఎం రమణమ్మ అంజలిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపారు.

February 20, 2026 / 10:34 AM IST

మహిళ కడుపులో 8 కిలోల కణితి తొలగింపు

ELR: జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స గురువారం జరిగింది. బుట్టాయిగూడెం మండలానికి చెందిన ఓ మహిళ కడుపులో 8 కిలోల కణితి ఉన్నట్లు వైద్యుడు సంకు మురళి గుర్తించారు. ల్యాపరో స్కోప్ ద్వారా ఆపరేషన్ నిర్వహించి కణితి తొలగించామన్నారు. కడుపు నొప్పితో సదరు మహిళా ఆసుపత్రికి వచ్చిందని, ఆపరేషన్ అనంతరం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

February 20, 2026 / 10:32 AM IST