కాపాడాల్సిన పోలీసు అధికారే కామంతో ప్రవర్తించాడు. పుట్టినరోజని ఉందంటూ ఓ యువతిని ఇంటికి పిలిచి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆపై వీడియోలు కూడా తీసి ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. అయితే యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. వచ్చే ఉగాదికి జనసేన, టీడీపీ నామరూపం లేకుండా పోతాయన్నారు. ఆ రెండు పార్టీలు ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని అన్నారు.
విశాఖలో పవన్ పర్యటిస్తున్నారు. రుషికొండను పరిశీలించేందుకు వెళ్తున్న పవన్‌కు పోలీసులు నిబంధనలతో కూడిన నోటీసులిచ్చారు. పవన్య పర్యటన సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
నటి రేణు దేశాయ్(renu desai) వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati rambabu) తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఆ క్రంమలో ఓ ట్వీట్ చేయగా..అది చూసిన నెటిజన్లు అంబటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మంత్రిపై సంచలన కామెంట్స్ కూడా చేశారు.
మరోసారి మంత్రి అమర్నాథ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఏం అనట్లేదని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఏదైనా అంటే చిన్నాపిల్లలు మారం చేసినట్లు కేంద్రానికి చెబుతా అంటారని ఎద్దేవా చేశారు.
ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan) అన్నారు. తప్పుడు వ్యక్తులను ఎన్నుకుంటే ఐదేళ్ల పాటు ప్రజలు బాధపడాల్సి ఉంటుందని గుర్తు చేశారు.
ఈ నాణేన్ని ఆగస్టు 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందింది.
ఏపీ రాజకీయాలపై, జనసేన అధినేత పవన్‌పై నటి రేణూ దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పిల్లలను రాజకీయాల్లో లాగొద్దని సూచించారు. రాజకీయ పరంగా తన సపోర్ట్ పవన్‌కే ఉంటుందని ఆమె తెలిపారు. వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేసుకోవడం ఆపాలని సూచించారు.
టమాట రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి భారీ ధరలు పలుకుతున్న టమాట ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం మదనపల్లి టమాట మార్కెట్లో కిలో రూ.44 నుంచి రూ.60లోపు పలుకుతోంది.