»President Will Release 100 Coins Printed With Ntr S Name On August 28
NTR Coin: ఎన్టీఆర్ పేరుతో రూ. 100నాణెం.. 28న రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరణ
ఈ నాణేన్ని ఆగస్టు 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందింది.
NTR Coin: టీడీపీ వ్యవస్థాపకుడు, సీనియర్ హీరో కీ.శే నందమూరి ఎన్టీ రామారావు పేరుతో రూ.100నాణేన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఖ్యాతీని తీసుకొచ్చిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆయన పేరుతో ఈ నాణేన్ని ముద్రించింది. అయితే ఈ నాణేన్ని ఆగస్టు 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందింది. ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింకుతో తయారు తయారు చేశారు.
ఈ రూ.100నాణేం 44 మిల్లీమీటర్ల చుట్టుకొలత ఉంటుంది. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం మరోవైపు ఎన్టీఆర్ చిత్రం దాని కింద శ్రీ నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో 1923-2023 అని ముద్రించి ఉంటుంది. నాణెం విడుదలకు కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దేశంలో చారిత్రక ఘటనలు, ప్రముఖుల గుర్తుగా ఇలాంటి ప్రత్యేక నాణెలు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇది 1964నుంచి కొనసాగుతోంది. మొదటిసారి మాజీ ప్రధాని నెహ్రూ నాణెం విడుదల చేయడం ప్రారంభించారు. ఆనవాయితీలో భాగంగా ఈ సారి ఎన్టీఆర్ పేరుతో వెండి నాణేన్ని విడుదల చేయడం పట్ల కుటుంబసభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.