అమెరికా (USA) హవాయి ద్వీపంలో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. కార్చిచ్చు ధాటికి 36 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. హరికేన్ (hurricane) వల్ల బలమైన గాలులు వీస్తుండడంతో కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.ఇప్పటికే అనేక భవనాలు, వాహనాలు కాలిపోతున్నాయి. 200కు పైగా భవనాలు అక్కడి ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయక చర్యలు సరిగ్గా జరగడం లేదు. వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మౌయి ద్వీపం(sland of Maui)లో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. పలువురు స్థానికుల ఆచూకీ తెలియడం లేదు. సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు చెప్పారు. మంటల ధాటికి నిస్సహాయ స్థితిలో సహాయక బృందాల కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని కొందరు తెలిపారు.
హెలికాప్టర్ల (Helicopters) ద్వారా పెద్ద ఎత్తున నీళ్లు చల్లుతూ మంటలను ఆర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ ఘటనలో గాయపడిన వారిని ఎయిర్ అంబులెన్స్ ల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచి ఈ కార్చిచ్చు వ్యాపిస్తున్నట్లు మౌయి కౌంటీ (Maui County) వెల్లడించింది. కార్చిచ్చుకు తోడు హవాయి సమీపంలో గంటకు 82 మైళ్ల వేగంతో, మావీయ్లో గంటకు 62 మైళ్ల వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. మంటల ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయని, చెట్లు, కార్లు, ఇతర వాహనాలు (Vehicles) కాలి బూడిదైనట్లు చెప్పారు. దావాగ్ని చుట్టుముట్టిన పరిస్థితుల కారణంగా అధికారులు 16 రోడ్లను మూసివేశారు. ప్రస్తుతం ఒకే ఒక్క హైవే మాత్రమే అందుబాటులో ఉడటంతో.. ఆ మార్గం గుండా వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.కార్చిచ్చు ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) స్పందించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు