నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేసినప్పుడు కూడా తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గానే ఉందని నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు. అయినా కూడా శాయశక్తులా తారకరత్నను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం గుండె నాళాల్లోకి రక్త ప్రసరణ కావడం లేదని వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఆసుపత్రిలో బాలకృష్ణ ఉన్నారు. ఆసుపత్రికి చంద్రబాబు, పురందేశ...
ఏపీ సీఎం అభ్యర్థి ఎవరో లోకేష్ చెప్పగలరా? అని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని సూటిగా ప్రశ్నించారు. నారా లోకేశ్ యువగళం పేరుతో ప్రారంభించిన పాదయాత్రపై ఆమె విమర్శలు గుప్పించారు. అసలు లోకేష్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదన్నారు. జగన్ ప్రభుత్వంలో పేదలు ఆనందంగా ఉన్నారని.. కేవలం అధికారం కోసమే యాత్రలు చేస్తున్నారని, చంద్రబాబును సీఎం చేయాలని పవన్ కళ్యాణ్ ఆరాటపడుతున్నారని ఆమె స్పష్టం చేశారు.
తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి వారు దర్శనం ఇస్తున్నారు. ఇవాళ రథ సప్తమి సందర్భంగా ఉదయం నుంచే మలయప్పస్వామి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సప్త వాహనాలపై తిరుమాఢ వీధుల్లో ఆయన ఊరేగుతున్నారు. కాగా, సాయంత్రం మలయప్పస్వామిని కల్పవృక్ష వాహనంపై విహరించారు. సూర్య ప్రభ, చిన్న శేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై స్వామి వారు భక్...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉందని ఆసుపత్రి వైద్యులు ఇంతకుముందే హెల్త్ బులిటెన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ సీనియర్ నేతలు బెంగళూరుకు వస్తున్నారు. చంద్రబాబు కూడా ఇంతకుముందే ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్నను ఆయన పరామర్శించనున్నారు. ప్రస్తుతం తారకరత్న ఐసీయూలో ఉన్...
ఒకనాటి దిగ్గజ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం సినిమాలు మానేసి తెలుగు రాష్ట్రాల్లో కాదు కాదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయ పరిణామాలపై తరచూ స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. పవన్ కల్యాణ్ రాజకీయంపై వ్యంగ్యాస్త్రాలు తనదైన శైలిలో స్పందిస్తూ ఆర్జీవీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటున్నాడు. తాజాగా పవన్ కల్యాణ్ కు కొందరు వెన్నుపోటు పొడుస...
అనంతపురము జిల్లాలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ సీపీ మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ బ్రదర్స్ వార్ కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే పెద్దరెడ్డిపై ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో పలు విషయాలపై వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. అయితే శనివారం ఎమ్మెల్యే కేతిరెడ్డి నియోజకవర్గంలో చే...
ఏపీలో ప్రస్తుతం జీవో నెంబర్ 1 గురించి సర్వత్రా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల టీడీపీ సభలో జరిగిన పలు ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఏపీలోని రోడ్ల మీద ర్యాలీలు, సభలు నిర్వహించకుండా ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 ను తీసుకొచ్చింది. అయితే.. దీనిపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. జీవో పేరుతో ప్రతిపక్ష పార్టీలను ఎలాంటి సమావేశాలు నిర్వహించుకోకుండా ప్రభుత్వం కక్షపూరితమైన చర్యలను పాల్పడుతోం...
నందమూరి తారకతర్న ఆరోగ్యం ప్రస్తుతం క్రిటికల్ గానే ఉందని నారాయణ హృదయాలయ ఆసుపత్రి డాక్టర్లు చెబుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ఇంకా చికిత్స అందించాలని వైద్యులు తెలిపారు. మరోవైపు బెంగళూరుకు నందమూరి కుటుంబ సభ్యులు బయలుదేరారు. సాయంత్రం వరకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బెంగళూరుకు రానున్నారు. టీడీపీ ముఖ్య నేతలు కూడా బెంగళూరుకు చేరుకుంటున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేతలు చినరాజప్ప, దేవినేని ఉమ నారాయణ...
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ది ఐరన్ లెగ్ అని.. అందుకే తారకరత్నకు గుండెపోటు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. లోకేశ్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ దారుణాలు జరుగుతాయని పరోక్షంగా చెప్పారు. ఆయన తండ్రి చంద్రబాబు సైకో అయితే.. అతడి కుమారుడు లోకేశ్ ఐరన్ లెగ్.. సైకో అని తెలిపారు. కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా లోకేశ్ గతంలో తనపై రోజా చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు. ...
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రెండో రోజు కూడా భారీ జనసందోహం మధ్య కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకే రెండో రోజు పాదయాత్ర ప్రారంభం అయింది. పేస్ వైద్య కళాశాల నుంచి ప్రారంభం అయింది. అక్కడి నుంచి బెగ్గిలిపల్లె దగ్గర లోకేశ్ ప్రసంగించారు. ఆ తర్వాత కడపల్లెలో ఇంటరాక్షన్, అక్కడి నుంచి కలమలదొడ్డిలో ఇంటరాక్షన్ అయిపోయాక.. అక్కడి నుంచి శాంతిపురం క్యాంపు వద్ద రెండో రోజు పాదయాత్ర ముగిసింది. అద్భుత ప్రజాస్పందన, అపూర్వ జ...
కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలో సీబీఐ టీమ్ ప్రశ్నలు సంధిస్తోంది. అవినాష్ రెడ్డి స్టేట్ మెంట్ ను అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. అయితే.. న్యాయవాదిని మాత్రం సీబీఐ అధికారులు అనుమతించలేదు. సీబీఐ ఆఫీసుకు అవినాష్ అనుచరులు భారీగా తరలివచ్చారు. సీబీఐ ఆఫీసుకు వైసీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు చేరుకున్నారు. వైఎస్ వివేకానంద హత...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలు వరుసగా రెండు రోజులు రద్దయ్యాయి. ముందే నిర్ణయించిన పర్యటనలను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. కార్యక్రమాలను వరుసగా రద్దు చేసుకోవడం వెనుక పెద్ద కథే ఉన్నట్టు తెలుస్తోంది. దానికి కారణం తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ వేగం కావడమేనని తెలుస్తున్నది. ఎందుకంటే ఈ కేసు విచారణ వేగం పెరిగింది. సీబీఐ రంగంలోకి దిగి తన సోదరుడు, వైఎస్సా...
నందమూరి తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన్ను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్యుల బృందంతో చికిత్స చేయిస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మరికొన్ని రోజులు చికిత్స అందించాలని వైద్యులు తెలిపినట్టు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ నిన్నటి నుంచి తారకరత్నతోనే ఉన్నారు. ఇవాళ కూడా ఇంకా బెంగళూరులోనే ఉన్నారు. న...
దేశమంతా గణతంత్ర వేడుకల్లో మునిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ లోని మాచర్లలో మాత్రం రౌడీల్లాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తించారు. పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేసే విషయంలో మొదలైన వివాదం పరస్పరం వీధి రౌడీల్లా దాడులు చేసుకునే స్థాయికి చేరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ పాఠశాలలో ఉద్రిక్తతకు దారి తీసింది. బాహాబాహీకి దిగడంతో విద్యార్థులు భయాందోళనలతో ఇళ...
బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో తారకరత్నకు చికిత్స జరుగుతోంది. డాక్టర్లు ప్రస్తుతం ఐసీయూలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. ఎమర్జెన్సీ చికిత్సలో భాగంగా ఎక్మో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 48 గంటల పాటు ఎక్మో చికిత్స అందించనున్నారు. కుప్పం హాస్పిటల్ నుండి నిన్న అర్ధరాత్రి తారకరత్నను బెంగళూరుకు తరలించారు. ఇక్కడ ఎక్మో చికిత్సను అందించే మూడు హాస్పిటల్లలో నారాయణ హృదయాలయ ఆస్పత్రి ఒకటి. చంద్రబ...