• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

క్రీడలతోనే ఆరోగ్య భారత్ సాధ్యం: మంత్రి

కోనసీమ: క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్య భారత్ సాకారమవుతుందని, కరాటే నేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు, ఆత్మ రక్షణ కూడా సాధ్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం RCM చర్చ్‌లో ఆదివారం జరిగిన ఫస్ట్ ఇంటర్ స్టేట్ ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్షిప్ -2026 పోటీలను మంత్రి ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలన్నారు.

February 22, 2026 / 07:00 PM IST

రేపు నిమ్మకూరులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం

కృష్ణా: పామర్రు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కీలక ప్రకటన చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం హాస్పిటల్ సహకారంతో రేపు నిమ్మకూరు గ్రామంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించనున్నారు. నియోజకవర్గ మహిళలు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 22, 2026 / 06:59 PM IST

జిల్లాలో రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం

GNTR: ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించే ఈ కార్యక్రమాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఆర్డీవోలు గ్రామ స్థాయి రికార్డులతో హాజరై ప్రజల అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు.

February 22, 2026 / 06:57 PM IST

బొగ్గరంలో ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

PLD: ఈపూరు మండలం బొగ్గరం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాళ్ల సందర్భంగా ఆదివారం స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలను భక్తులు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని పొంగళ్లు పొంగించి స్వామికి నైవేద్యం సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

February 22, 2026 / 06:57 PM IST

తిరువూరులో ఆంగ్ల ఉపాధ్యాయురాలికి సత్కారం

NTR: అంతర్జాతీయ మాతృభాషా వారోత్సవాల ముగింపు సందర్బంగా తిరువూరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల సీనియర్ ఆంగ్ల ఉపాధ్యాయురాలు జయశ్రీని ఎల్టా కన్వీనర్ యం. రాం ప్రదీప్ పాఠశాలలో ఆదివారం శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంగ్ల ఉపాధ్యాయ సిబ్బంది కె. లావణ్య, ఎన్.గీత, విద్యార్థులు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:56 PM IST

కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి రూ.1 లక్ష విరాళం

ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం స్థానిక దాత ఎనిమిరెడ్డి బాలకోటయ్య రూ.1,00,000లను అందించారు. ఈ చెక్కును ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నరసింహారెడ్డికి సమర్పించారు. కనిగిరి మండలం రాగిమనిపల్లికి చెందిన బాలకోటయ్య సేవా భావాన్ని ఎమ్మెల్యే అభినందిస్తూ, ఆసుపత్రి అభివృద్ధికి ఈ నిధులు వినియోగిస్తామని తెలిపారు.

February 22, 2026 / 06:54 PM IST

మచిలీపట్నంలో రోడ్డు భద్రతపై అవగాహన

కృష్ణా: మచిలీపట్నం NH-216 పై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, డీఎస్పీ రాజా పర్యవేక్షణలో ట్రాఫిక్ సీఐ రాజు ఆధ్వర్యంలో హెల్మెట్ ధారణ, రోడ్డు భద్రతపై వాహనదారులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాద రహిత జిల్లాగా మార్చాలని అధికారులు కోరారు.

February 22, 2026 / 06:54 PM IST

ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నివాళులర్పించిన ఎస్పీ

బాపట్ల: తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలోని ఉయ్యాలవాడ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:52 PM IST

‘పరీక్షల సమయంలో జిరాక్స్ షాపులు మూసివేయాలి’

SKLM: ఆమదాలవలసలోని ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కేంద్రం సమీపంలో 144 సెక్షన్ అమలు చేసినట్లు స్థానిక ఎస్సై బాలరాజు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పరీక్షల సమయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు నివారించేందుకు ఈనెల 23 నుండి మార్చి 18 వరకు ప్రతిరోజూ ఉ. 8 గంటల నుంచి మ. 1 గంట వరకు జిరాక్స్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని పేర్కొన్నారు.

February 22, 2026 / 06:50 PM IST

సేవాభావం చాటుతున్న సత్యన్న సేన సంస్థ

సత్యసాయి: తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ వద్ద ఆదివారం సత్యన్న సేన సభ్యులు సేవా కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ స్ఫూర్తితో ఐదుగురు గర్భిణీలకు ఆరు రకాల పౌష్టికాహారాన్ని అందజేశారు. నిరుపేద గర్భిణీలకు ప్రసవం వరకు ప్రతి నెలా ఈ పోషక ఆహారం పంపిణీ చేస్తామని సభ్యులు తెలిపారు. కరోనా కాలం నుంచి ఈ సేవ చేస్తున్నామని తెలిపారు.

February 22, 2026 / 06:50 PM IST

పేకాట శిబిరంపై దాడి.. కేసు నమోదు

కృష్ణా: ఉయ్యూరు రూరల్ పరిధిలోని పెదఓగిరాల గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఎస్సై సురేష్ బాబు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.5,800ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 22, 2026 / 06:50 PM IST

క్రీడలతోనే పిల్లల సమగ్ర వికాసం

VSP: క్రీడల ద్వారా చిన్నారుల్లో మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందని ఏసీపీ కె. ప్రభాకర్ అన్నారు. మురళీనగర్ స్కేటింగ్ పార్కులో కియా వరల్డ్ స్కూల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్కేటింగ్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువుతో పాటు ఆటల్లో రాణించడం వల్ల పిల్లలు ఏ సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కోగలరని పేర్కొన్నారు.

February 22, 2026 / 06:46 PM IST

మల్లేశ్వర స్వామి ఆలయానికి విరాళం అందజేత

GNTR: పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి విజయవాడ భాస్కరరావు ఆదివారం రూ. 50 వేల విరాళం అందజేశారు. ఆలయ ఉపకమిషనర్ లీలా కుమార్, పాలక మండలి ఛైర్మన్ పూర్ణచందర్రావు స్వీకరించారు. ఆలయ అభివృద్ధి, నిత్య అన్నదానానికి భక్తులు విరాళాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. దాతకు ప్రత్యేక దర్శనం, శేషవస్త్రంతో సత్కరించారు.

February 22, 2026 / 06:46 PM IST

‘బడ్జెట్‌తో సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదు’

VZM: బడ్జెట్‌తో సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని వైసీపీ ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు అన్నారు. ఆదివారం భోగాపురం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ పెట్టగా అందులో సామాన్య ప్రజలకు ఎంత మాత్రం ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు.

February 22, 2026 / 06:43 PM IST

విద్యార్థులకు విద్యాసామగ్రిని అందజేత

ELR: విద్యాభివృద్ధికి నా వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని రెవరెండ్ డి.చెల్లప్ప సుమా అన్నారు. ఆదివారం ఉంగుటూరులో యెహోవా యీరే మినిస్ట్రీస్ ట్రస్ట్ ద్వారా పదో తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్యాడ్, స్కేల్స్ పెన్నలు అందజేశారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు అందజేస్తున్న చెల్లప్ప సుమను పలువు అభినందించారు.

February 22, 2026 / 06:35 PM IST