• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Kotam reddy Letter to Amit shah.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. అమిత్ షాకి కోటంరెడ్డి లేఖ..!

అమిత్ షాకి లేఖ రాసిన కోటంరెడ్డి. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఇటీవల ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సీఎం జగనే స్వయంగా తన ఫోన్ ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు.

February 8, 2023 / 07:10 PM IST

Amaravati: రాజధాని ద్రోహి గోబ్యాక్.. ఎమ్మెల్యేకు చేదు అనుభవం

అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల నుంచి రాజధాని ప్రాంతవాసులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానాలు కూడా అమరావతికే మొగ్గు చూపగా సీఎం జగన్ కక్షపూరితంగా రాజధానిని విశాఖను మారుస్తున్నాడు.

February 8, 2023 / 07:10 PM IST

2వ రోజు కొనసాగిన సైబర్ క్రైమ్ నివారణ వారోత్సవాలు

తిరుపతి జిల్లాలో రెండవ రోజు సైబర్ క్రైమ్(cyber crime) నివారణ వారోత్సవాలు కొనసాగాయి. ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీలు వెంకటరావు, విమల కుమారి అధ్యక్షత ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సత్యనారాయణ సహకారంతో వారోత్సవాలు నిర్వహించారు.

February 8, 2023 / 06:44 PM IST

Nara Lokesh: రాజధాని ఒకేచోట, జగన్ కళ్లలోకి సూటిగా చూడలేరు

ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఒకటేనని, అది కూడా అమరావతి అని నారా లోకేష్ కుండబద్దలు కొట్టారు. రాజధాని మాత్రమే ఒక్కటి అని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ తమ లక్ష్యమని చెప్పారు. సూటిగా కళ్లలోకి చూడలేని నాయకుడు జగన్ అని ఎద్దేవా చేశారు.

February 8, 2023 / 06:37 PM IST

Amaravati: అమరావతే… ఏపీ రాజధానిపై కేంద్రం మరోసారి క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంటు సాక్షిగా స్పష్టతను ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని అమరావతి (Amaravati) అంటూ తేల్చి చెప్పింది. ఈ మేరకు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాతపూర్వక సమాధానం ఇచ్చింది. సెక్షన్ 5, 6 ప్రకారం రాజధాని ఏర్పాటు జరిగిందని గుర్తు చేసింది. అమరావతిని (Amaravati) రాష్ట్ర రాజధానిగ...

February 8, 2023 / 03:54 PM IST

ఎన్నాళ్లీ మోసం.. జగన్‌తో చెప్పించగలవా: విజయసాయికి విష్ణు

వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రత్యేక హోదా పేరుతో గతంలో ఏపీ ప్రజలను మోసం చేసిన పార్టీలకు ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారని, ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డి గుర్తిస్తే మంచిదని హితవు పలికారు. ప్రస్తుతం దేశ, రాష్ట్ర ప్రజలు సెంటిమెంటుతో కూ...

February 8, 2023 / 02:31 PM IST

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు.. చెన్నైకి తరలింపు

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను నెల్లూరు అపోలో ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. గుండెలో రెండు వాల్ మూసుకుపోయాయని డాక్టర్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలిస్తున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ్ముడే చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వీరిది కీలకపాత్ర. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంచి పలుకుబడి ఉంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ...

February 8, 2023 / 02:05 PM IST

అదేం లేదు.. లోకేశ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన డ్రైవర్‌ను తీసేయలేదు

యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌కు ఆర్టీసీ డ్రైవర్‌ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ ఫోటో, వీడియోలు ట్రోల్ అయ్యాయి. అయితే అతనిని విధుల నుంచి తప్పించారని ప్రచారం జరిగింది. షేక్ హ్యాండ్ ఇస్తే జాబ్ నుంచి తీసేస్తారా అని చర్చ జరిగింది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ స్పందించింది. ఆ డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తీసివేయలేదని స్పష్టంచేసింది. సోషల్ మీడియాలో ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తప్పుపట్టింది. వారిని గుర్తించి, చట్ట...

February 8, 2023 / 12:30 PM IST

ఫోన్ ట్యాపింగ్‌పై అమిత్ షాకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ

ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏపీలో కాక రేపుతోంది. ట్యాపింగ్‌పై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. విచారణ జరపాలని అందులో హోం మంత్రి అమిత్ షాను కోరారు. ట్యాపింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యక్తిగత అంశాలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా విన్నారని తెలిపారు. తన వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించారని పేర్కొన్నారు. ట్యాపింగ్ చేశారని చెబితే వైసీపీ నేతలు/ ఎమ్మెల్యేలు ...

February 8, 2023 / 12:38 PM IST

రాజధాని పై విజయసాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్…!

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో స్పష్టత లేదన్న విషయం అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం… అమరావతిని రాజధానిగా ప్రకటించగా… ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించింది. విశాఖను పరిపాలన రాజధానిగా కన్ఫామ్ చేస్తూ… సీఎం జగన్ ప్రకటన చేశారు. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన అంశం ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో ఉన్న‌ది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండ‌గా ఇలాంటి...

February 8, 2023 / 11:08 AM IST

ఈ నెల 10న కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయం

ఏపీ ప్రభుత్వం కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయం ఈ నెల 10వ తేదీన విడుదల చేయనుంది. సీఎం జగన్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. గత ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ మధ్య పెళ్లి చేసుకున్న యువతులకు సాయం అందజేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అమ్మాయిలకు ఆర్థిక సాయం ఇస్తారు. ఎస్సీలకు రూ. లక్ష సాయం ఇస్తారు. ఆ సామాజిక వర్గానికి చెందిన యువతి ఇతర […]

February 8, 2023 / 07:42 AM IST

జగన్ జైలుకెళ్తే మీకే ఛాన్స్, ఏపీకి వెళ్లు: షర్మిలకు కడియం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లే అవకాశాలు రావొచ్చునని, కాబట్టి వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తమ రాష్ట్రానికి వెళ్లాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మంగళవారం హితవు పలికారు. తెలంగాణ బడ్జెట్ పైన షర్మిల మాట్లాడటం బాధాకరమన్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలో ఆమె పాదయాత్ర చేశారని, కానీ అలాంటి సోదరికి ఆయన అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి షర్మిల తనకు జరిగిన...

February 7, 2023 / 09:38 PM IST

బారాషాహీద్ దర్గాకు నిధులు ఇవ్వలే.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జనాల్లోకి వెళుతున్నారు. ఈ రోజు నెల్లూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తన వర్గీయులతో అన్ని అంశాలపై మాట్లాడారు. పార్టీ నుంచి బయటకు వస్తానని చెబితే ఉలిక్కిపడుతున్నారని కామెంట్ చేశారు. తాను చేసిన తప్పేంటి అని అడిగారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం నేరమా? అని నిలదీశారు. నెల్లూరు రూరల్‌లో పథకాలకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేక...

February 7, 2023 / 09:35 PM IST

జనసేనతో కలిసి పోటీ.. టీడీపీకి దూరం: సోము వీర్రాజు

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. ముఖ్య నేతలు మాత్రం పాదయాత్ర బాట పట్టారు. బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తామని అంటోంది. ఇటు టీడీపీతో కూడా జనసేన సఖ్యంగానే ఉంటుంది. దీంతో ఏ ఏ పార్టీ కలిసి పోటీ చేస్తుందనే అంశంపై స్పష్టత లేదు. ఇదే విషయంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. జనసేనతో కలిసి పోటీ చేస్తామని అంటున్నారు. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని మరోసారి తేల్చిచెప్పారు. కర్నూలు జిల్లా ఎ...

February 7, 2023 / 07:46 PM IST

వీకెండ్ విశాఖ వెళ్లు.. సీఎం జగన్‌కు రఘురామ సూచన

విశాఖ నచ్చితే వీకెండ్ వెళ్లాలని సీఎం జగన్‌కు రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు సూచించారు. ఇటీవల విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని జగన్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. దీంతో రఘురామ కృష్ణరాజు స్పందించారు. జగనన్న విశాఖ వెళతారనే చర్చ రాష్ట్రమంతా నడుస్తోందని అన్నారు. రాజు ఎక్కడుంటే అదే రాజధాని కాదని రఘురామ కామెంట్ చేశారు. రాజధానిపై సుప్రీంకోర్టు ...

February 7, 2023 / 06:27 PM IST