ఏపీ ప్రభుత్వం కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయం ఈ నెల 10వ తేదీన విడుదల చేయనుంది. సీఎం జగన్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. గత ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ మధ్య పెళ్లి చేసుకున్న యువతులకు సాయం అందజేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అమ్మాయిలకు ఆర్థిక సాయం ఇస్తారు.
ఎస్సీలకు రూ. లక్ష సాయం ఇస్తారు. ఆ సామాజిక వర్గానికి చెందిన యువతి ఇతర కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే రూ.1.20 లక్షలు ఇస్తారు. ఎస్టీలకు కూడా రూ.లక్షల ఇస్తారు. కులాంతర వివాహం చేసుకున్న రూ.1.20 లక్షలు ఇస్తారు. బీసీ యువతులకు రూ.50 వేలు.. కులాంతర వివాహాం చేసుకుంటే రూ.75 వేలు ఇస్తారు. మైనార్టీ అమ్మాయిలకు రూ. లక్ష, దివ్యాంగుల వివాహానికి రూ.1.50 లక్షల సాయం అందజేస్తారు. భవన నిర్మాణ కార్మికుల వివాహానికి రూ.40 వేల సాయం ఇస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ఉన్న సంగతి తెలిసిందే. పేదింటి ఆడపిల్లల పెళ్లి ఖర్చుల కోసం రూ. 1,00,116 ఆర్థిక సాయం అందజేస్తుంది. ఇప్పటి వరకు 12 లక్షల 469 మంది ఆడపిల్లలకు రూ. 10,416 కోట్ల సాయం చేసింది. 18 ఏళ్లు నిండి ఆడపిల్లలకు పథకం వర్తిస్తుండటంతో బాల్య వివాహాలు తగ్గిపోయాయి.