ఏపీలో అనుమతి లేకుండా కళాశాలలను వేరే ప్రాంతానికి మార్చుతున్న ప్రైవేటు యాజమాన్యంపై ఇంటర్ బోర్డు సీరియస్ అయ్యింది. ఇకపై అనుమతులు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించనుంది.
తిరుమల క్షేత్రానికి సంబంధించిన భూములు, బంగారం, ఇతర ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని స్పష్టం చేశారు. ఇదే అంశంపై టీటీడీ ధర్మకర్తల మండలి, హిందూ ధార్మిక సంస్థలు, భక్తుల అభిప్రాయాలను సేకరిస్తాం.
వైఎస్సార్ సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది. తనను అరెస్ట్ చేస్తారనే భయంతో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడంతో ఈ కేసు తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.
దూర ప్రయాణానికి కొన్ని చోట్ల నేరుగా అక్కడకు బస్సులు ఉండకపోవచ్చు. రెండు బస్సులు మారి అక్కడకు చేరుకుంటారు. ఆ సమయంలో ఏ బస్సు ఎక్కితే ఆ బస్సులో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా తీసుకొచ్చిన పథకంతో ఇకపై రెండు టికెట్లు తీసుకోనవసరం లేదు.
తెలుగు రాష్ట్రాల మధ్య అనేక రోజులుగా ఉన్న వివాదం సమసినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య న్యూఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న ఆంధ్ర భవన్‌లోని ప్రధాన ఆస్తుల విభజనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త ప్రతిపాదనను సూచించగా ఏపీ ఓకే చెప్పింది.
నా కూతురు చదువు ఆగిపోతుంది అని ప్రభావతి వాపోయింది. ఇది విన్న చంద్రబాబు చలించిపోయారు. ‘మీ అమ్మాయి చదువుకు ఎంత కావాలమ్మా?’ అని చంద్రబాబు అడిగారు. అప్పటికప్పుడు చంద్రబాబు పార్టీ నాయకుల సహాయంతో రూ.2.3 లక్షలు సేకరించి వైసీపీ కార్యకర్త అయిన ప్రభావతికి అందించారు.
కోర్టు ఆదేశాల ధిక్కరణ కేసులో ఏపీ ఆర్టీసీ ఎండీ(AP RTC MD) ద్వారకా తిరుమలరావు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతో పాటుగా మరో ముగ్గురికి హైకోర్టు(High Court) శిక్ష వేసింది.
ఏపీలోని ఏవోబీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది అల్లూరి జిల్లాలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో 10 మందికి గాయాలయ్యాయి ఈ క్రమంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు
గుంటూరు నగరంలో ఏటి అగ్రహారం రెండో లైన్ పేరును రాత్రికి రాత్రి ఫాతిమా నగర్ అని కార్పొరేషన్ సిబ్బంది మార్చారు. స్థానికులు ఆ బోర్డును చించి.. తమ పాత పేరుతో మరో బోర్డును ఏర్పాటు చేసుకున్నారు.
అరాచక పాలన సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలంతా (MLAs) పార్టీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో (Nellore District) చోటుచేసుకున్న పరిణామాలే సాక్ష్యం. ముగ్గురు కీలకమైన ఎమ్మెల్యేలు, జిల్లాలోనే పెద్ద దిక్కుగా ఉన్న నేతలు పార్టీపై బహిరంగ విమర్శలు చేసిన విషయం తెలిసింద...
పల్నాడు జనారణ్యంలోకి పెద్ద పులులు టైగర్ ఫారెస్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన రెండు పెద్ద పులులు కారంపూడి, దుర్గి, బొల్లాపల్లి మండలాల వైపు వచ్చే అవకాశం ఉందన్న అధికారులు ఈ క్రమంలో ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అటవీశాఖ అధికారులు మరోవైపు అవి మనుషులను చంపేవి కాదని తెలిపిన ఆఫీసర్స్ అవి కనిపిస్తే వాటికి ఇబ్బంది కలిగించవద్దని వెల్లడి ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లకూడదని సూచన