»Ati Agraharam To Fatima Nagar Name Change Controversy In Guntur
APలో మరో పేరు మార్పు వివాదం.. సీఎం జగన్‌పై సోము వీర్రాజు ఫైర్
గుంటూరు నగరంలో ఏటి అగ్రహారం రెండో లైన్ పేరును రాత్రికి రాత్రి ఫాతిమా నగర్ అని కార్పొరేషన్ సిబ్బంది మార్చారు. స్థానికులు ఆ బోర్డును చించి.. తమ పాత పేరుతో మరో బోర్డును ఏర్పాటు చేసుకున్నారు.
Ati Agraharam To Fatima Nagar Name Change Controversy In Guntur
Ati Agraharam To Fatima Nagar:ఆంధ్రప్రదేశ్‌లో మరో పేరు మార్పు వివాదం అగ్గిరాజేసింది. ఇప్పటికే విశాఖలో (vizag) గల సీతమ్మ కొండ (sithamma konda) పేరు మార్చడం, ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహాం (tippu sultan statue) పెట్టాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఇంతలో గుంటూరులో ఓ కాలనీ పేరు మార్చడం కాంట్రవర్సీ అయ్యింది. దీనిపై కాలనీ వాసులు భగ్గుమన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు (somu veerraju) మండిపడ్డారు. రాష్ట్రంలో ఎందుకు ముస్లింల (muslims) పేరు పెడుతున్నారని సూటిగా ప్రశ్నించారు.
గుంటూరు (guntur) ఆనంద త్రిదండి అగ్రహారంలోని రెండో లైన్ పేరును కార్పొరేషన్ సిబ్బంది మార్చారు. ఏటీ అగ్రహారం (Ati Agraharam) రెండో లైన్ పేరును ఫాతిమా నగర్ అని బోర్డు పెట్టారు. దీంతో స్థానికులు (locals) ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎందుకు పేరు మార్చారని మండిపడ్డారు. అయినప్పటికీ సిబ్బంది ఆ బోర్డును (board) తొలగించలేదు. స్థానిక యువకులు ఫాతిమా నగర్ (Fatima Nagar) నేమ్ బోర్డు చింపివేశారు. తిరిగి అక్కడ ఏటి అగ్రహారం అని పాత పేరుతో బోర్డును ఏర్పాటు రాశారు.
శ్రీరామ్ నగర్‌ను (sri ram nagar) చైతన్య నగర్ (chaitanya nagar) అని మార్చారు. దీనిపై స్థానికులు భగ్గు మంటున్నారు. అగ్రహారానికి సంబంధించి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో అవి వైరల్ అవుతున్నాయి. ఏటీ అగ్రహారం పేరు మార్పుకు సంబంధించి సోము వీర్రాజు (somu veerraju) మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. రాత్రికి రాత్రే పేరు మార్చడంలో ప్రభుత్వం ఉద్దేశం ఏమిటని ఆయన అడిగారు.