తెలంగాణ ముఖ్యమంత్ర కేసీఆర్.. తన బీఆర్ఎస్ పార్టీని… పక్క రాష్ట్రమైన ఆంధ్రాలో విస్తరించే పనిలో ఉన్నారు. ఈ విషయంలో ప్రజల సంగతి పక్కన పెడితే… పాలకులు మాత్రం పెద్ద ఎత్తున వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. అధికార పార్టీతో పాటు… ప్రతిపక్ష పార్టీలు కూడా.. కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టడాన్ని విమర్శిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మంత్రి రోజా స్పందించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసింది ముఖ్యమంత్రి క...
కందుకూరు, గుంటూరులలో చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి ప్రాణ నష్టం కలిగింది. వరసగా రెండు ఘటనలలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో… ఆయన కుప్పం పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. సభలు, రోడ్ షోల నిర్వహణపై ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఉత్తర్వుల ఆధారంగా చంద్రబాబు పర్యటనపై పోలీసులు స్పందించారు. స్థానిక టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గంలోని ప...
ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ నెమ్మదిగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. కొందరు నేతలు ఆ పార్టీలో చేరారు కూడా. మరి కొందరు చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి కొందరు జనాల పల్స్ ని బట్టి చేరాలా వద్దా అనేది ఆలోచిందామని అనుకుంటున్నారు. ఈ క్రమంలో… ఈ పార్టీ పై తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పందించారు. ఏపీలోకి బీఆర్ఎస్ రావటం మంచిదేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని ఎక్కువ పార్టీలు వస్తే...
ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ ని పటిష్టం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. కాగా… ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పై తాజాగా విజయశాంతి స్పందించారు. ఏపీలో జనసేనను, ఆపార్టీతో సానుకూలమై ఉన్న బీజేపీని నష్టపరిచే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేరికల పరిణామాలే సంకేతాలు ఇస్తున్నాయని చెప్పారు. ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తోట చంద్రశేఖరా, రావెల కిషోర్ బాబు, చింతల పార్థసారథి, టీజే ప్రకాశ్, రమేష్ నాయుడు, శ్రీనివాస్ నాయుడు, రామారావు తదితరులు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశమంతా వెలుగులతో నిండిపోతుందని, యావత్ దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఏపీలో కొంతమంది ...
చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి రోజా విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ నాయకులకే లోకేష్ పాదయాత్ర అంటే భయంగా ఉన్నట్లు ఉందన్న రోజా లోకేష్ అడుగు పెడితే పార్టీ పరిస్థితి 23 స్థానాల నుంచి దిగజారుతుందని టీడీపీ నాయకులకు భయంగా ఉందని అన్నారు. లోకేష్ పాదయాత్ర పోస్టర్ లో చంద్రబాబు ఫోటో కూడా లేదని, లోకేష్ పాదయాత్ర ప్రజల కోసం కాదు… లోకేష్ ఫిట్ నెస్ కోసమేనని అన్నారు. లోకేష్ పాదయాత్ర ఆపాల్సిన పని తమకు ల...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో సమయంలో.. తొక్కిసలాట జరిగి దాదాపు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే… గుంటూరులోనూ చంద్రబాబు సభలోనే తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరస రెండు సంఘటలను దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో బహిరంగంగా రోడ్లపై...
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్ని పార్టీల ముఖ్య నేతలు… తమ పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు. చంద్రబాబు సైతం.. పార్టీని మళ్లీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో సరిగా పని చేయని నేతలకు వార్నింగ్ లు కూడా ఇస్తున్నాయి. ఇలా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారని బాధతో… రాజానగరం టీడీపీ ఇన్ ఛార్జ్ పదవికి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకట...
అన్ని విషయాలపై స్పందించే పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కారణంగా అంత మంది ప్రాణాలు కోల్పోతే ఎందుకు స్పందించడం లేదని మంత్రి రోజా ప్నశ్నించారరు. సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించిన ఆమె… చంద్రబాబు, పవన్ లపై విమర్శలు కురిపించారు. జగన్ ముఖ్యమంత్రి అవటం రాష్ట్రం అదృష్టమని ప్రజలు అనుకుంటున్నారని రోజా తెలిపారు. గత ఏడాదిలో చంద్రబాబు పనికి మాలిన పాత్ర పోషించాడని విమర్శించారు. జగన్‌ను తిట్టడానికే, చంద్రబాబు...
కాపు సామాజిక వర్గానికి చెందిన నేత తోట చంద్రశేఖర సోమవారం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే పలు పార్టీలు మారిన ఆయన… ఆంధ్రప్రదేశ్‌లో ప్రభావం చూపే అవకాశం తక్కువేనని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో నిలకడగా ఉండగలుగుతారా? కాపు సామాజిక వర్గంలో ఎంత పట్టు ఉంది? అధికారిగా తప్ప, రాజకీయాల...
ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్ష తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ఒక్కటయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల ఓటీటీ ఆహాలో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ రావడం పొత్తుకు మరింత సానుకూలత ఏర్పడిందని చెప్పేందుకు నిదర్శనమని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యుత్సాహంతో పొత్తు ప్రయత్నాలపై మొదటికే మో...
ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ వేగంగా పావులు కదుపుతోంది. పార్టీలో చేరే నేతలు కూడా పెరుగుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా… ఈ పార్టీ ప్రభావం ఏపీలో ఎంత ఉంటుంది అనే విషయంపై తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభావం ఏ మాత్రం ఉండదని కొడాలి నాని తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని విడగొట్టడంలో గానీ, రాష్ట్రానికి నష్టం కలిగించడంలో గానీ కేసీఆర్ పాత్ర ఉందని రాష్ట్ర ప్రజలు నమ్ముత...
తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినట్లుగానే, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం పూర్తి చేస్తామని వ్యాఖ్యానించారు. ఎర్రబెల్లి దయాకర్, శ్రీనివాస్ గౌడ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి, గంగుల కమలాకర్ తదితరులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆం...
బీఆర్ఎస్( భారత రాష్ట్ర సమితి) ఏపీలోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పలువురు ఏపీలోని నేతలను తమ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. వారిలో.. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు కూడా ఉన్నారు. నేటి సాయంత్రం తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రావెల కిషోర...
కేసీఆర్ ఏపీలో పవన్ కళ్యాణ్‌కు గండి కొడతారా? ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైన భారత రాష్ట్ర సమితి(BRS) జాతీయ పార్టీగా మారడంతో ఇతర రాష్ట్రాలలో పార్టీ పటిష్టత, కార్యకలాపాలు, పోటీ తదితర అంశాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తొలుత సాటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా అడుగులు వేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పార్టీ అనుబంధ వ...