ఎన్నికలు దగ్గరపడుతుండటంతో… ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా జనసేన, వైసీపీ నేతల మధ్య వాదోపవాదనలు మిన్నంటుతున్నాయి. ఒకరిపై మరొకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలంతా పవన్ ని టార్గెట్ చేసి మరీ విమర్శలు చేస్తున్నారు. పవన్ సైతం ఏమాత్రం తగ్గకుండా వారి మాటలకు కౌంటర్లు ఇస్తున్నారు. కాగా.. సడెన్ గా పవన్.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్...
జనసేన, వైసీపీ ల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే… జనసేన నుంచి పవన్(pawan kalyan) ఒక్కరే కాగా.. వైసీపీ నుంచి మాత్రం చాలా మంది సమాధానం చెబుతున్నారు. తాజాగా.. పవన్ చెప్పుతో కొడతానంటూ చేసిన విమర్శలకు.. ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్ నాథ్(gudivada amarnath) గట్టి కౌంటర్ కౌంటర్ ఇచ్చారు. ఫ్రస్టేషన్ ఎక్కువై పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడు...
జనసేన(janasena party) అధితనే పవన్ కళ్యాణ్(pawan kalyan) రాజకీయంగా తన పార్టీని వచ్చే ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటన ప్లాన్ చేసుకున్నారు. కానీ అదే సమయంలో వైసీపీ విశాఖ గర్జన కార్యక్రమం చేయడంతో ఇద్దరి మధ్య వాదనలు మొదలయ్యాయి. తమ కార్యక్రమాన్ని ఆపాలనే యత్నంతోనే పవన్ విశాఖ వచ్చారంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. పవన్ వ్యక్తిగత విషయాలను సైతం రాజకీయం చేస్తూ వైసీపీ...
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పార్టీలో కాస్త స్ట్రాంగ్ ఎవరు ఉన్నారు అంటే… ముందుగా… మంత్రి రోజా(minister roja) పేరు కచ్చితంగా వినపడుతుంది. ఆమె మంత్రి అవ్వకముందు కూడా ప్రతిపక్షం పై తన గళం వినిపించేవారు. అందుకే అందరూ ఆమెను ఫైర్ బ్రాండ్ అని పిలిచేవారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆమెకు మంత్రి పదవి కట్టబెడతారు అని అందరూ అనుకున్నారు. కానీ.. కాస్త ఆలస్యంగానే ఆమెకు ఆ పదవి దక్కింది. ఇక అసలు విషయంలోకి వస్త...
రాబోయే ఎన్నికల్లో తన పోటీపై వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) క్లారిటీ ఇచ్చారు. తాను వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేయబోతున్నట్లు వల్లభనేని వంశీ పేర్కొన్నారు. ఎంపీ గా పోటీ చేయబోతున్నట్లు వస్తున్న వార్తలను అయన ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు పై నిప్పులు చెరిగారు.14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని...
లోక్ సత్తా పార్టీ… ఎక్కడో విన్నట్లు ఉంది కదా..? రాజకీయాల్లో మార్పు తెస్తానంటూ జయప్రకాశ్ నారాయణ(jayaprakash narayan) పెట్టిన పార్టీ ఈ లోక్ సత్తా. ఆయన పార్టీ పెట్టిన కొత్తలో… ఆ పార్టీ సిద్దాంతాలకు చాలా మంది ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా విద్యావంతులు, ఉద్యోగులు ఆయన పార్టీకి ఇంప్రెస్ అయ్యారు. ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అయితే… ప్రజలను పార్టీ సిద్దాంతాలో కాస్త ఆకర్షించారు కానీ.. ప్రజల్లోకి తీసుకువ...
వైజాగ్ నగరంలో శుక్రవారం వైసీపీ అధ్యక్షతన విశాఖ గర్జన కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జనసేన నేతలు కూడా ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టారు. ఈ క్రమంలో.. జనసేన కావాలనే తమ కార్యక్రమాలను నాశనం చేయాలని చూస్తోందని… తమ మంత్రులపై దాడులు చేసిందంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై పవన్ ఘాటుగానే స్పందించారు. ఉత్తరాంధ్ర పర్యటనను మూడు నెలల క్రిందటే తాము ఖారారు చేశామని, వైసీపీ మూడు రాజధానుల కార్యక్రమ...
వైసీపీ నేతలు విశాఖపట్నంలో విశాఖ గర్జన చేసిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం అనంతరం ఎయిర్ పోర్టులో కొందరు మంత్రులపై దాడి జరిగింది. ఆ దాడి జనసేన నేతలు చేశారంటూ పలువురు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో… ఈ విషయంపై నాదెండ్ల మనోహర్ స్పందించారు. విశాఖ విమానాశ్రయంలో మంత్రులు మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేశారని రాష్ట్ర మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందని నాదెండ్ల మనోహర్ అన్నారు. అసలు మంత్రుల కార్ల మీద దాడ...
ఆంధ్రప్రదేశ్ లో రాజధాని విషయం రోజు రోజుకీ హీట్ పెంచుతోంది. అమరావతి రాజధానిగా ఉండాలని అక్కడి ప్రాంత ప్రజలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా… విశాఖనే పరిపాలనా రాజధానిగా ఉండాలని అధిక పార్టీ మొండిపట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో… ఈ రోజు వైసీపీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. జేఏసీ పిలుపు మేరకు వైసీపీ నేతల మద్దతుతో విశాఖ నగరంలో గర్జన నిర్వహించారు. ఏపీ మంత్రులు దాదాపుగా ఈ గ...
బాలయ్య అన్ స్టాపబుల్ షోకి చంద్రబాబు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా… ఈ షోపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ఆ షోలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలేనని అంబటి ఆరోపించారు. కేవలం తనకు రాజకీయాలకు ఉపయోగపడాలనే ఈ టాక్ షోకి చంద్రబాబు వచ్చాడంటూ నిప్పులు చెరిగాడు. 27 ఏళ్ళ కిందట చేసిన వెన్నుపోటు రక్తపు మరకలను బావ, బావమరుదులు కలిసి తుడిచే ప్రయత్నం చేశారని అంబటి రాంబాబు అన్నారు. మూడు గంటలు కాళ...
బాలయ్య అన్ స్టాపబుల్ షోకి చంద్రబాబు గెస్ట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. అయితే… ఆ షోలో చంద్రబాబు మాట్లాడిన మాటలపై వైసీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో… తాజాగా… వైసీపీ నేత , ఏపీ మంత్రి అంబటి రాంబాబు కూడా ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు. ‘ఆరోజు ఎమ్మెల్యేలంతా వ్యతిరేకించారు. దీనిపై పెద్దాయనతో బాలయ్య, హరికృష్ణ, నాతో సహా మొత్తం ఐద...
బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ షోకి మొదటి గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ప్రోమో నందమూరి, నారా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే… రాజకీయంగా ఉపయోగపడాలనే ఇలా ప్లాన్ చేశారని విమర్శించేవారు కూడా ఉన్నారు. కాగా.. తాజాగా.. ఈ విషయంపై మంత్రి రోజా స్పందించారు. ...
కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశంలో తొలిసారిగా ఈ కేబుల్ వంతెనను 1082 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని…ఐకానిక్ బ్రిడ్జ్ రూపు రేఖ చిత్రాలను గడ్కరీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వంతెన దేశంలో మొదటిది కానుండగా…ప్రపంచంలో రెండోదిగా ...
ఈరోజు నుంచి వారం రోజుల పాటు రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెనపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు… తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మరమ్మత్తు పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో గోదావరి 4వ బ్రిడ్జ్, గామన్ బ్రిడ్జ్ మీదుగా వాహనాలను మల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈనెల 17న రోడ్ కమ్ రైలు వంతెన మీదుగా అమరావతి రైతులు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్య...
జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ తొలినాళ్లలో సక్సెస్ కావడంలో కొడాలి నాని పాత్ర ఎంతో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన పలు సినిమాలకు కొడాలి నాని నిర్మాతగా వ్యవహరించారనే సంగతి తెలిసిందే. అదుర్స్ సినిమా వరకు జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య అనుబంధం కొనసాగింది. ఆ తర్వాత పొలిటికల్ కారణాలు, ఇతర కారణాల వల్ల తారక్, కొడాలి నాని కలిసి కనిపించలేదు. అ...