బాలయ్య అన్ స్టాపబుల్ షో అదరగొడుతోంది. మొదటి సీజన్ కంటే… సెకండ్ సీజన్ మరింత సూపర్ గా ఆకట్టుకుంటోంది. ఈ సెకండ్ సీజన్ లో మొదటి ఎపిసోడ్ చంద్రబాబుతో మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొందరు సినిమా వాళ్లతో రెండు, మూడు ఎపిసోడ్ లు చేయగా మళ్లీ… మరో పొలిటికల్ లీడర్ ని పిలుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే… పిలిచే రాజకీయ నాయకులందరూ జగన్ కి వ్యతిరేకంగా ఉన్నవారే కావడం గమనార్హం. ఈ శుక్రవారం ప్రసార...
జనసేనాని పవన్ కళ్యాణ్ పై వైసీపీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరి తర్వాత మరొకరు పవన్ పై విమర్శల వర్షం కురుస్తోంది. కాగా… తాజాగా.. మంత్రి బొత్స సత్య నారాయణ పవన్ పై విమర్శల వర్షం కురిపించారు. పవన్.. తమ ప్రభుత్వంపై ప్రధాని మోదీకి ఫిర్యాదుచేయడం పై ఘాటుగా స్పందించారు. సినిమా నటుడు వచ్చాడని చూసేందుకు వచ్చిన జనాల ముందు ఆవేశంగా మాట్లాడితే సరిపోతుందా అని మంత్రి ప్రశ్నించార...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆడియో లీకులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఓ మంత్రి ఆడియో లీకు బయటకు రాగా…. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేరిట మరో ఆడియో లీకు బయటకు రావడం గమనార్హం. గతంలో మంత్రిగా ఓ మహిళతో అయన మాట్లాడిన సంభాషణ వైరల్ అయింది. ఐ లవ్యూ బంగారం అంటూ ఆయన మాట్లాడిన మాటలు… అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఆయన వయసేంటి.. ఇంత లేటు వయసులో ఇలాంటి కాల్స్ ఏంటీ అని పలువురు విమర్శిస్తున్నారు. [&he...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా చురకలు అంటించారు. పవన్ పరిస్థితి తెగిన గాలిపటంలా మారిందని రోజా ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎవరితో కలుస్తారో.. ఏ పార్టీతో కలుస్తారో అర్థం కాని పరిస్థితిలో , అయోమయంలో ఉన్నారని రోజా అన్నారు. పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంలో ప్రజాబలం లేదని బిజేపి నేతలు నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు. అందుకే మొన్న విశాఖ టూర్ లో పవన్ ను పక్కన పెట్టాడని ఎద్దేవా చేశారు. అంద...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీలో పోలీసులు కేసు పెట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. ఇటీవల గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామంలో రహదారి అభివృద్ధి పేరుతో ప్రభుత్వం కొన్ని ఇళ్ల అక్రమ ఆక్రమణల విషయంలో కూల్చివేతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే… ఈ విషయంలో పవన్ చాలా సీరియస్ గా స్పందించారు. అసలు ఇవి ఆక్రమణలు కా...
ఆంధ్రప్రదేశ్ ని ప్రధాని మోదీ ఆదుకోవాలంటూ సీఎం జగన్ రిక్వెస్ట్ చేయడం విశేషం. మోదీ… తెలుగు రాష్ట్రాల్లో పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… జగన్ .. ప్రధాని మోదీకి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడుతూ విభజన గాయాల నుంచి ఏపీ ఇంకా కోలుకోలేదని ప్రధానికి తెలియజేశారు. విశాఖలో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని నరేం...
ప్రధాని నరేంద్రమోదీ.. ఏపీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ నగరంలో బస చేస్తున్న ఆయన.. జనసేనాని పవన్ తో భేటీ కూడా అయ్యారు. కాగా.. అంతక ముందు.. ఆయన రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ నేతలతో ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకెళ్లడంపై దిశానిర్దేశం చేశారు. జగన్ ప్రభుత్వ పాలనపై పోరాడాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచ...
ప్రధాని నరేంద్రమోదీ ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖలో ప్రధానికి ప్రజలు నీరాజనం పట్టారు. ఘన స్వాగతం పలికారు. కాగా… విశాఖలోనే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత… పవన్ తో మోదీ భేటీ అయ్యారు. ప్రధాని బస చేసిన ఐఎన్‌ఎస్ చోళ హోటల్‌లో ఇరువురూ సుమారు 35 నిమిషాల పాటు చర్చించారు. పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీపై తెలుగు రాష్ట్రా...
ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం విశాఖ పర్యటనకు వస్తున్నారు. 12న పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఏయూలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ టూర్‌కు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెళతారా లేదా అన్నదానిపై కొనసాగుతున్న సస్పెన్స్ కు బ్రేకులు పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో ఈ రోజు రాత్రి 8.30గంలకు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. విశాఖ నగరంలో ఇఎన్ఎస్...
కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఎప్పుడైతే ఫోకస్ పెట్టారో… అప్పుడే.. చంద్రబాబు కూడా.. తెలంగాణలో టీడీపీని నిలపెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత.. టీడీపీ తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయింది. ఆ పార్టీ నేతలు కూడా వేర్వేరు పార్టీల్లోచేరిపోయారు. కాగా.. ఇప్పుడు మళ్లీ… ఇన్నాళ్ల తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీని బతికించేందుకు చంద్రబాబు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. క...
టాలీవుడ్ నటడు అలీ… ఇటు సినిమాలతోపాటు… అటు రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసి పార్టీ విజయానికి తన వంతు సహాయం చేశాడు. ఈ క్రమంలో తాజాగా జగన్ ప్రభుత్వం అలీ కి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పదవిని కేటాయించాడు. అయితే ఈ పదవి దక్కినందుకు ఆలీ సంతోషం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శల వర్షం కురిపించాడు. అసలు ఇప్పటం గ్రామంలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని… పవన్ ఎందుకు అంత ఓవర్ గా రియాక్ట్ అయ్యాడో అర్థం కాలేదని సజ్జల పేర్కొనడం విశేషం. సభకు స్థలం ఇచ్చిన ఒక్కరి ఇల్లు కూడా పోలేదని, ప్రభావం పడే అవకాశం ఉన్న ఒక వ్యక్తి కూడా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడని గుర్తుచేశారు. దీనికి పవన్ కళ్యా...
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ నగరంలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ ఏపీలో పర్యటనలో బాగంగా.. జగన్ విశాఖలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పలు అభివృద్ది, శంకుస్ధాపన కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. ప్రధాని తిరిగి వెళ్లేంతరకు ఆయనతోనే ఉండనున్నారు. ప్రధానికి వీడ్కోలు పలికిన తర్వాత తిరుగు పయనం కానున్నారు. రేపు సాయంత్రం 5.05 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ విశాఖ ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ మత ప్రభోధకుడు కేఏపాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ విలువ రోజు రోజుకీ దిగజారిపోతోందంటూ కేఏ పాల్ పేర్కొనడం గమనార్హం. ఏ నాయకుడు చేయని విధంగా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు 9 పార్టీలు మారాడని చురకలు అంటించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం, సిపిఐ, సిపిఎం మొదలు బహుజన సమాజ్వాది పార్టీ, బిజెపి లాంటి ఎన్నో పార్టీలతో జట్టు కట్టి పవన్ క...
తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటూ… మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన కామెంట్స్ … హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి అధికారంలో ఉన్న ఏ పార్టీ నాయకులు…. ప్రజల్లో తమకు వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని అంగీకరంచరు. తమ పాలన అద్భుతంగా ఉన్నాయనే నిరూపించుకోవాలని అనుకుంటారు. అయితే.. సడెన్ గా.. ధర్మాన చేసిన కామెంట్స్ షాకింగ్ గా మారాయి. ఆయన చేసిన కామెంట్స్ పార్టీకి పాజిటివ్ గా మారతాయా..? ల...